ఉద్యోగం ఇప్పిస్తానని రమ్మని యువతి పై దారుణంగా...  

men arrested in hyderabad - Telugu Hyderabad, Hyderabad Crime News, Hyderabad Latest News, Hyderabad Local News, Hyderabad News, Hyderabad Telangana, Men Arrested,

తెలంగాణ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకున్నప్పటికీ మహిళలపై జరుగుతున్న మాత్రం ఆగడం లేదు.తాజాగా ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి కారులో తీసుకెళ్లి ఆమెతో మద్యం తాగించి దారుణంగా అత్యాచారం చేసిన ఘటన సికింద్రాబాద్ ప్రాంతంలో చోటు చేసుకుంది.

Men Arrested In Hyderabad

వివరాల్లోకి వెళితే హైదరాబాద్ నగరానికి చెందినటువంటి ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి పని నిమిత్తమై మహారాష్ట్ర కి వెళ్ళాడు.ఈ క్రమంలో తన స్నేహితుడి ద్వారా ఓ యువతి పరిచయమై తాను ప్రస్తుతం డిగ్రీ పూర్తి చేశానని తన కుటుంబం ప్రస్తుతం కష్టాల్లో ఉందని కాబట్టి తనకు ఏదో ఒక ఉద్యోగం ఇప్పించాలని కోరింది.

అయితే అందుకు అతను సరే అంటూ ఆమె దగ్గర నెంబర్ తీసుకుని హైదరాబాద్ నగరానికి వచ్చేశాడు.ఆ తర్వాత మళ్లీ ఆమెకు ఉద్యోగం ఉందని కానీ ఇంటర్వ్యూకి హాజరవ్వాలని కాబట్టి హైదరాబాద్ రమ్మని ఫోన్ చేశాడు.

దీంతో ఉద్యోగం వస్తుందనే ఆశతో ఆ యువతి అతడు చెప్పిన మాటలు నమ్మి సికింద్రాబాద్ కి వచ్చింది.అలాగే బస నిమిత్తమై రైల్వే స్టేషన్ కి దగ్గరలో ఉన్నటువంటి ఓ లాడ్జిలో దిగింది.అయితే ఈ క్రమంలో  అతడు రాత్రి పదిన్నర గంటల సమయంలో ఫోన్ చేయగా ఆ యువతి లాడ్జి రూమ్ నుండి బయటకు వచ్చింది. ఈ క్రమంలో ఆమెను కారులో ఎక్కించుకుని  ఆ వ్యాపారి మరియు తన స్నేహితుడు కలిసి బలవంతంగా మద్యం తాగించారు.

దీంతో మత్తులోకి జారిన టువంటి ఆ యువతి తనని లాడ్జి రూమ్ లో దించాలని కోరింది.కానీ వాళ్లు మాత్రం అదే ప్రాంతంలో ఉన్నటువంటి మరో హోటల్ లో రూము ని అద్దెకి తీసుకుని అందులోకి ఆమెను తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చేశారు.

దీంతో ఆ యువతి 100 నంబర్ కి ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చింది.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని యువతి ఇచ్చినటువంటి వివరాల ఆధారంగా ఫిర్యాదు నమోదు చేసుకున్నారు.

అనంతరం యువతిని వైద్య చికిత్సల నిమిత్తం దగ్గరలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.అలాగే నిందితులను అరెస్టు చేసి విచారణ నిమిత్తమై రిమాండుకు తరలించారు.

#Hyderabad #Men Arrested

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Men Arrested In Hyderabad Related Telugu News,Photos/Pics,Images..