ఫోటో తీయమంటే... ఏకంగా ఫోటో స్టూడియోలోనే బాలికపై....   

హైదరాబాద్ నగరంలో మహిళల పై అత్యాచారాలు రోజురోజుకి ఎక్కువవుతున్నాయి.తాజాగా పాస్ ఫోటోలు తీయించుకొనేందుకు ఓ మైనర్ బాలిక ఫోటో స్టూడియోకి వెళ్లగా ఫోటోలు తీసే వ్యక్తి ఆమెపై అత్యాచారం చేయడానికి యత్నించిన ఘటన హైదరాబాదు నగరంలోని సైనిక్ పూరి ప్రాంతంలో చోటు చేసుకుంది.

TeluguStop.com - Men Arrested For Misbehaviour With Minor Girl In Hyderabad

వివరాల్లోకి వెళితే 16 సంవత్సరాలు కలిగినటువంటి ఓ మైనర్ బాలిక స్థానిక నగరంలోని సైనిక్ పురి ఈ ప్రాంతంలో నివాసం ఉంటోంది.అయితే తన వ్యక్తిగత పని నిమిత్తమై పాస్ ఫోటోలు అవసరం కాగా ఫోటోలు తీయించుకుకోవడం కోసం దగ్గరలో ఉన్నటువంటి ఫోటో స్టూడియోకి వెళ్ళింది.

అయితే అక్కడ ఉన్నటువంటి ఫోటో స్టూడియో యజమాని సలీం అనే వ్యక్తి బాలికను ఫోటోలు తీసేందుకు రూమ్ లోకి తీసుకెళ్లి ఆమెపై అసభ్యకరంగా చేతులు వేస్తూ అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు.ఇది గమనించిన టువంటి బాలిక వెంటనే అతడి నుంచి తప్పించుకుని బయటకు వచ్చింది.

ఇది గమనించినటువంటి స్థానికులు ఏమైందని బాలికను ప్రశ్నించగా జరిగిన విషయం చెప్పింది.దీంతో వెంటనే స్థానికులు ఫోటో స్టూడియో యజమానిని బయటికి తీసుకొచ్చి దేహ శుద్ధి చేస్తూ తీవ్రంగా గాయపరిచారు.

సమాచారం అందుకున్న టువంటి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గాయపడ్డ నిందితుడిని చికిత్స నిమిత్తం దగ్గరలో ఉన్నటువంటి ఆస్పత్రికి తరలించారు.అలాగే బాధితురాలు తెలిపిన టువంటి వివరాల మేరకు ఫిర్యాదు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇటీవల కాలంలో దిశ ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించినప్పటికీ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్నటువంటి ఆకృత్యాలు మాత్రం ఆగడం లేదు.అంతేగాక రోజుకో సంఘటన బయటపడటంతో ప్రజా సంఘాలు కూడా ప్రభుత్వ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

#HyderabadCrime #HyderabadLcoal #HyderabadLatest

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Men Arrested For Misbehaviour With Minor Girl In Hyderabad Related Telugu News,Photos/Pics,Images..