ఆఫ్ఘానిస్తాన్‌లో వీరమరణం.. పదేళ్ల తర్వాత భారత సంతతి సిక్కు సైనికుడికి అమెరికా అరుదైన గౌరవం

ఆఫ్ఘనిస్థాన్‌లో మరణించిన భారత సంతతి సిక్కు సైనికుడు గురుప్రీత్ సింగ్‌కు పదేళ్ల తర్వాత అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది.ఆర్లింగ్టన్‌లోని ప్రఖ్యాత నేషనల్ స్మశానవాటికలో ఈ గురువారం అతని గౌరవార్థం స్మారక సేవను నిర్వహించారు.

 Memorial Service Of Sikh Soldier Held At Arlington National Cemetery In Us-TeluguStop.com

ఆఫ్ఘనిస్తాన్‌లో మరణించిన ఏకైక సిక్కు సైనికుడు గురుప్రీత్ ఒక్కరే.దీనిపై అతని సోదరి మన్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.

తన సోదరుడు ఆఫ్ఘనిస్తాన్‌లో పదేళ్ల క్రితం మరణించారని గుర్తుచేసుకున్నారు.తాము అతనిని సరైన విధంగా ఖననం చేయలేకపోయామని.

 Memorial Service Of Sikh Soldier Held At Arlington National Cemetery In Us-ఆఫ్ఘానిస్తాన్‌లో వీరమరణం.. పదేళ్ల తర్వాత భారత సంతతి సిక్కు సైనికుడికి అమెరికా అరుదైన గౌరవం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అలాగే గురు‌ప్రీత్‌కు ఆర్లింగ్టన్‌లోని జాతీయ స్మశాన వాటికలో చోటు కావాలని కోరుకున్నట్లు మన్ ప్రీత్ తెలిపారు.

కాగా, అమెరికా సాయుధ దళాల్లో చేరిన గురుప్రీత్‌ను కాలిఫోర్నియాలోని క్యాంప్ పెండ్‌లేటన్‌లోని వున్న ఫస్ట్ బెటాలియన్, 5వ మెరైన్ రెజిమెంట్, 1వ మెరైన్ డివిజన్‌కు కేటాయించారు.

ఈ నేపథ్యంలో 2011లో ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల ఏరివేతకు అమెరికా పంపిన దళాల్లో గురుప్రీత్ భాగం పంచుకున్నారు.ఈ సమయంలో దక్షిణ ఆఫ్ఘనిస్తాన్‌లోని హెల్మాండ్ ప్రావిన్స్‌లోని సంగిన్ ప్రాంతంలో జరిగిన పోరులో తాలిబన్ల చేతిలో గురుప్రీత్ మరణించారు.చనిపోయే సమయానికి గురుప్రీత్ వయసు కేవలం 21 ఏళ్లే కావడం దురదృష్టకరం.

2020 నవంబర్‌లో గురుప్రీత్‌ స్మారకాన్ని జాతీయ స్మశానవాటికలో నెలకొల్పారు.అమెరికా తరపున యుద్ధాల్లో మరణించిన సిక్కు సంతతి సైనికుల్లో గురుప్రీత్ రెండో వ్యక్తి.ఈ లిస్ట్‌లో స్థానం పొందిన తొలి వ్యక్తి ఉదయ్ సింగ్.2003 డిసెంబర్ 1న ఇరాక్‌లోని బాగ్ధాద్ సమీపంలోని హెబ్బనియాలో అమెరికా సైనికుల కాన్వాయ్‌పై జరిగిన దాడి సందర్భంగా ఉదయ్ సింగ్ ప్రాణాలు కోల్పోయారు.చండీగఢ్‌కు చెందిన లెఫ్టినెంట్ కల్నల్ ప్రీత్ మొహిందర్ సింగ్ కుమారుడే ఉదయ్ సింగ్.

సెక్టార్ 45లోని సెయింట్ స్టీఫెన్స్ స్కూల్‌లో చదువుకున్న ఉదయ్ సింగ్.అమెరికాలో గ్రీన్ కార్డ్ పొంది యూఎస్ ఆర్మీలో చేరారు.2001 ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు కువైట్‌లో సేవలందించిన ఉదయ్ సింగ్‌కు ప్రతిష్టాత్మక ఆర్మీ అచీవ్ మెంట్ మెడల్ దక్కింది.సెప్టెంబర్ 8, 2003న అతని బృందాన్ని అమెరికా ప్రభుత్వం ఇరాక్‌కు పంపింది.

#Gurpreet #MemorialService #Taliban #Iraq #Afghanistan

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు