ఈ టాలీవుడ్ హీరోయిన్ బాలీవుడ్ విలన్ ని పెళ్లి చేసుకుంది... ప్రస్తుతం...

తెలుగులో ప్రముఖ స్వర్గీయ సీనియర్ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన “ఫిట్టింగ్ మాస్టర్” అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన ముంబై బ్యూటీ “మదాలస శర్మ” గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ అమ్మడు వచ్చీరావడంతోనే అల్లరి నరేష్ హీరో చిత్రంలో హీరోయిన్ గా అవకాశం దక్కించుకుంది.

 Mem Vayasuku Vacham Movie Fame Madalasa Sharma Real Life And Marriage News-TeluguStop.com

 కానీ ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో గుర్తింపు లభించలేదు.అయినప్పటికీ పట్టు విడవకుండా టాలీవుడ్ సినిమా పరిశ్రమలో అవకాశాల కోసం ప్రయత్నించింది.

ఈ క్రమంలో తెలుగు భాషలోనే కాకుండా తమిళం, కన్నడ, తదితర భాషలలో కూడా హీరోయిన్ గా నటించింది.కానీ తన చిత్రాల కథల విషయంలో అవగాహన లోపించడంతో ఎక్కువ శాతం చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి.

 Mem Vayasuku Vacham Movie Fame Madalasa Sharma Real Life And Marriage News-ఈ టాలీవుడ్ హీరోయిన్ బాలీవుడ్ విలన్ ని పెళ్లి చేసుకుంది… ప్రస్తుతం…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీంతో క్రమ క్రమంగా సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.దీంతో తన వైవాహిక జీవితంపై దృష్టి సారించింది.

ఈ క్రమంలో హిందీలో పలు చిత్రాలలో విలన్ గా నటించిన “మహాక్షయ్ చక్రవర్తి” అనే నటుడిని ప్రేమించి 2018 వ సంవత్సరంలో పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం తన కుటుంబ సభ్యులతో కలిసి మదాలస శర్మ ముంబైలో నివాసముంటున్నట్లు సమాచారం.

అయితే మదాలస శర్మ తెలుగులో చివరగా నూతన దర్శకుడు “శ్రీపురం కిరణ్” దర్శకత్వం వహించిన “రామ్ లీల” అనే చిత్రంలో ఓ చిన్న పాత్రలో కనిపించింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పటివరకు ఈ అమ్మడు తెలుగు సినిమాల్లో నటించలేదు.

  ప్రస్తుతం ఈ అమ్మడు సినిమా అవకాశాలు లేకపోవడంతో వ్యాపారాలపై దృష్టి సారించినట్లు సమాచారం.మదాలస శర్మ అప్పట్లో తెలుగులో రెండో హీరోయిన్ గా నటించిన “మేం వయసుకు వచ్చాం” చిత్రం ప్రేక్షకులను ఎంతగానో అలరించింది.

 కానీ ఈ చిత్రంలో ఈ అమ్మడి పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో ఎవరూ గుర్తించలేదు…

.

#Madalasa Sharma #MemVayasuku #MemVayasuku #MadalasaSharma #MadalasaSharma

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు