కబాబ్ తిన్న మహిళకు 88 వేలు జరిమానా... ఎందుకంటే?

మనలో చాలామందికి కొన్ని వంటకాలు అంటే చాలా ఇష్టం ఉంటుంది.ఇష్టమైన వంటకాలను తినడానికి ఎంత ఖర్చు చేయడానికైనా వెనుకాడం.

 Woman Breaks Lock Down Rules To Eat Kabab Fined 88 Thousand Rupees,melbourne, Ka-TeluguStop.com

కొన్నిసార్లు మనకు నచ్చే వంటకం ఇతర ప్రాంతాల్లో లభిస్తుందని తెలిస్తే ఆ ప్రాంతాలకు వెళ్లి మరీ ఆ వంటకాలను మనం కొనుగోలు చేస్తూ ఉంటాం.అలా ఒక యువతికి కూడా కబాబ్ అంటే ఎంతో ఇష్టం.

ఆ యువతి ఎంతో ఇష్టమైన కబాబ్ కోసం ఏకంగా 75 కిలోమీటర్లు ప్రయాణం చేసింది.

అంత దూరం ప్రయాణం చేసిన తరువాత ఆ ప్రాంతంలో ఎంతో రుచిగా ఉండే కబాబ్ ను కొనుగోలు చేసింది.

అయితే ఊహించని విధంగా అధికారులు ఆమెకు ఏకంగా 88 వేల రూపాయలు జరిమానా విధించారు.కబాబ్ తింటే జరిమానా విధించడం ఏమిటని ఆశ్చర్యపోతున్నారా…? కరోనా వైరస్ విజృంభణ వల్ల లాక్ డౌన్ అమలవుతున్న ప్రాంతంలో నిబంధనలను ఉల్లంఘించి సదరు మహిళ కబాబ్ కొనుగోలు చేసింది.

లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానా విధిస్తున్న నేపథ్యంలో సదరు యువతి సైతం నిబంధనలు ఉల్లంఘించినందు వల్ల ఏకంగా 88 వేల రూపాయలు జరిమానా చెల్లించాల్సి వచ్చింది.లాక్ డౌన్ వల్ల ఇంటి ఫుడ్ తిని బోర్ కొట్టి సదరు యువతి రూల్స్ పాటించకుండా కబాబ్ కొనుగోలు చేయడానికి వెళ్లింది.

అయితే ఈ ఘటన జరిగింది మన దేశంలో కాదు.ఆస్ట్రేలియాకు చెందిన యువతి కబాబ్ పై ఉన్న ఇష్టంతో 75 కిలోమీటర్లు ప్రయాణించి కబాబ్ పై ఉన్న ఇష్టాన్ని చాటుకుంది.

ప్రస్తుతం మెల్ బోర్న్ లో నాలుగో దశ కరోనా ఆంక్షలు అమలవుతున్నాయి.వెర్రీబీ పోలీసులు అటుగా వెళుతున్న మహిళను ప్రశ్నించగా తాను జిలాంగ్ నుంచి వెర్రీబీకి తన ప్రియుడిని కలవడం కోసం, కబాబ్ తినడం కోసం వచ్చానని తెలిపింది.

అయితే కర్ఫ్యూ అమలులో ఉన్న సమయంలో నిబంధనలు ఉల్లంఘించడంతో జరిమానా విధించామని అధికారులు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube