ఆస్ట్రేలియా: సిడ్నీ బాటలో మెల్‌బోర్న్.. రికార్డు స్థాయిలో కేసులొస్తున్నా, లాక్‌డౌన్‌ ఎత్తివేతకే మొగ్గు

కరోనాతో అష్టకష్టాలు పడిన ఆస్ట్రేలియా ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది.దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ని పరుగులు పెట్టించడం, కఠిన ఆంక్షల వల్ల ఆస్ట్రేలియాలో వైరస్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది.

 Melbourne Set For Covid Lockdown Exit Despite Record Cases , Australia, Sydney,-TeluguStop.com

ఇప్పటికే సిడ్నీలో 107 రోజుల లాక్‌డౌన్‌కు తెరదించుతూ ఈ సోమవారం నుంచి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.తాజాగా దేశంలోని మరో పెద్ద నగరం మెల్‌బోర్న్‌లోనూ త్వరలో లాక్‌డౌన్‌ను ఎత్తివేయడానికి కసరత్తు జరుగుతోంది.

వచ్చే వారం నుంచి మెల్‌బోర్న్‌లో లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తామని.ఊహించిన దానికంటే వేగంగా వ్యాక్సినేషన్ జరగడమే ఇందుకు కారణమని విక్టోరియా ప్రీమియర్ డేనియల్ ఆండ్రూస్ గురువారం అన్నారు.

కాగా, ఆగస్టు ప్రారంభంలో డెల్టా వేరియంట్ వ్యాప్తి మొదలైన తర్వాత ఎన్నడూ లేని విధంగా గురువారం విక్టోరియా రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 2,297 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.ఇది ఏ ప్రాంతంలోనైనా ఆస్ట్రేలియాలోనే అత్యధికం.

అలాగే కోవిడ్ మహమ్మారి వల్ల 11 మంది ప్రాణాలు కోల్పోయారు.విక్టోరియా రాష్ట్రంలో అర్హత కలిగిన వయోజనులలో డబుల్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య 70 శాతంగా వుంది.

ఈ నేపథ్యంలోనే త్వరలో స్టే హోమ్ ఆంక్షలను ఎత్తివేస్తామని అధికారులు తెలిపారు.ఆ లక్ష్యం వాస్తవానికి అక్టోబర్ 26 నాటికి నెరవేరుతుందని అంచనా.

అయితే గురువారం నాటికి ఇది 62 శాతానికి చేరుకుంది.

లాక్‌డౌన్ ఎత్తివేతకు సంబంధించి రోడ్ మ్యాప్‌ను త్వరలోనే విడుదల చేస్తామని విక్టోరియా ప్రీమియర్ గురువారం మెల్‌బోర్న్‌లో జరిగిన మీడియా సమావేశంలో అన్నారు.

నగరంలో రాత్రి పూట కర్ఫ్యూను కూడా ఎత్తివేస్తామని ఆయన తెలిపారు.రోడ్ మ్యాప్ ప్రకారం.వ్యాపారాలు కఠినమైన నిబంధనల మధ్య నిర్వహించుకోవాలని ఆండ్రూస్ చెప్పారు.అయితే వ్యాక్సినేషణ్ 80 నంచి 90 శాతానికి చేరుకున్నప్పుడు మరిన్ని ఆంక్షలు సడలిస్తామన్నారు.

కాగా, సిడ్నీ టీకా టార్గెట్‌ను చేరుకోవడంతో దాదాపు 107 రోజుల పాటు నిరంతరాయంగా కొనసాగిన లాక్‌డౌన్‌ నుంచి సిడ్నీ వాసులకు సోమవారం విముక్తి కలిగింది.ప్రభుత్వ నిర్ణయంతో పబ్‌లు, రెస్టారెంట్లు, దుకాణాలు సైతం తిరిగి కార్యకలాపాలను ప్రారంభించాయి.

ఎన్నాళ్లో వేచిన ఉదయం అన్నట్లుగా ప్రజలు రోడ్లపైకి రావడంతో సిడ్నీలో సోమవారం సందడి వాతావరణం నెలకొంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube