వైట్ హౌస్ లో మెలానియా ట్రంప్ క్రిస్మస్ వేడుకలు..  

Melania Trump Unveils White House Christmas Decorations-christmas Decorations 2019,melania Trump,white House

అగ్రరాజ్యం అమెరికాలో క్రిస్మస్ వేడుకలు మొదలయ్యాయి.ఈ వేడుకులకి అమెరికా ప్రధమ పౌరురాలు అయిన అధ్యక్షుడు ట్రంప్ సతీమణి మెలానియా ట్రంప్ పాల్గొననున్నారు..

వైట్ హౌస్ లో మెలానియా ట్రంప్ క్రిస్మస్ వేడుకలు..-Melania Trump Unveils White House Christmas Decorations

గడిచిన ఏడాది వైట్ హౌస్ లో క్రిస్మస్ చెట్లతో అలంకరించిన చెట్లతో ఫోటోలు దిగిన మెలానియా ఆ ఫోటోలని అప్పట్లో ట్విట్టర్ లో పంచుకున్నారు.ఇప్పుడు ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

క్రిస్మస్‌ పండుగ దగ్గర పడుతున్న సమయంలో ఈ సంవత్సరం కూడా ఎరుపురంగు చెట్లతో వైట్ హౌస్ ని అలంకరించే పనిలో పడ్డారు.అయితే అందుకు తాలూకు ఆ వీడియోని మెలాని యా ట్విటర్‌లో పంచుకున్నారు. ఈ క్రిస్మస్‌ సెలవుల సమయంలో వైట్‌ హౌస్‌ ఈ విధంగా కనిపిస్తోందంటూ ఆమె ట్వీట్‌ చేశారు…

అయితే కేవలం ఎరుపు రంగు చెట్లని ఎంచుకోవడానికి కారణాలని వైట్ హౌస్ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు…అధ్యక్షుడి అధికార ముద్రలో ఉండే ఎరుపు, లేత రంగు చారలకు గుర్తుగా మేము ఎరుపు రంగు క్రిస్మస్‌ చెట్లనే ఎంచుకున్నాం.ఈ చారలు ధైర్య, సాహసాలకి పరాక్రమానికి ప్రతీక అంటూ తెలిపారు.