అధ్యక్ష పదవి ఊడగానే ట్రంప్ కి దిమ్మతిరిగే షాక్ రెడీ...

అమెరికాకు కొత్త అధ్యక్షుడు వచ్చేశాడు.గడిచిన కొన్ని రోజులుగా బిడెన్ గెలుపును ఒప్పుకోని ట్రంప్ మళ్ళీ ఎన్నికల్లో పలు చోట్ల రీ కౌంటింగ్ పెట్టాలని, అధ్యక్షుడిగా ఎలా అయినా గెలుపొందాలని వ్యహాలు రచించారు.

 Melania Trump Officials Condemns Rumors On Divorce, Donald Trump, Melania, Divor-TeluguStop.com

కానీ కోర్టులు సైతం ట్రంప్ వైఖరిని తప్పుబట్టడంతో పాటు చీవాట్లు పెట్టాయి.ట్రంప్ కూతురు ఇవాంకా , అల్లుడు సైతం ట్రంప్ ను ఓటమిని అంగీకరించి అధికార బదలాయింపు చేయాలని కోరారు.

అయితే చాలా రోజుల తరువాత మెత్తబడిన ట్రంప్ తన ఓటమిని అంగీకరిస్తూ అధికారాల బదలాయింపు కు ఒకే చెప్పేశారు.ఇక్కడి వరకూ బాగానే ఉన్నా

ఇకపై ట్రంప్ కు కష్టాలు ముంచుకొస్తున్నాయనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

గత కొన్ని రోజలుగా ట్రంప్ సతీమణి మెలానియా ట్రంప్ కు విడాకులు ఇవ్వనున్నారనే వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి.ఈ విషయం పై ఇప్పటివరకూ క్లారిటీ లేకపోయిన ఇద్దరి ప్రవర్తనలపై అనుమానాలు రాకపోలేదు.

కానీ తాజాగా ట్రంప్ రాజకీయ సహాయకురాలిగా పనిచేసిన ఓమరోసా ఈ విషయంపై స్పందించారు.ట్రంప్ అధికారం నుంచి దిగిన వెంటనే మెలానియా విడాకుల విషయంపై ఓ నిర్ణయానికి రానున్నాయని తెలిపారు.

అయితే అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆమె ఎందుకు విడాకులు ఇవ్వరనే విషయం పై కూడా ఓ క్లారిటీ ఇచ్చారు.

Telugu America Divorce, Divorce, Donald Trump, Melania, Melaniatrump-Telugu NRI

ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో విడాకులు ఇస్తే తన అధికారాన్ని ఉపయోగించి ఎక్కడ చర్యలు తీసుకుంటారోననే భయం ఆమెలో ఉందని అందుకే ఆ భయంతోనే విడాకులు ముందుగా ఇవ్వడం లేదని తెలిపారు.అయితే ఈ విషయంపై మెలానియా అధికార ప్రతినిధులు స్పందించారు.మెలానియా పై వస్తున్న వార్తలు నిజం కాదని చెప్పారు.

తమ 15 ఏళ్ళ వైవాహిక జీవితాన్ని ఆమె వదులుకోవడానికి సిద్దంగా లేరని, త్వరలోనే ఈ ఆరోపణలపై మెలానియా అందరికి క్లారిటీ ఇస్తారని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube