Melania Trump : అమెరికా అధ్యక్ష ఎన్నికలు : డొనాల్డ్ ట్రంప్ కోసం రంగంలోకి మెలానియా

2024 అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది.

డెమొక్రాట్ పార్టీ నుంచి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్( Joe Biden ) రిపబ్లికన్ పార్టీ నుంచి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌లు( Donald Trump ) అధికారికంగా నామినేషన్లను దక్కించుకుని మరోసారి అధ్యక్ష బరిలో తలపడనున్నారు.

దీంతో రానున్న రోజుల్లో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా జరగనుంది.ట్రంప్ కోసం ఆయన మద్ధతుదారులు ముమ్మరంగా ప్రచారం చేస్తుండగా.

కుటుంబ సభ్యులు కూడా శ్రమిస్తున్నారు.తాజాగా ఆయన సతీమణి మెలానియా ట్రంప్ ( Melania Trump )రంగంలోకి దిగారు.

సాధారణంగా లో ప్రొఫైల్‌ మెయింటైన్ చేసే మెలానియా పబ్లిక్‌లో కనిపించడం చాలా అరుదు.అలాంటి ఇటీవల ఫ్లోరిడా ప్రైమరీ సందర్భంగా తన కుటుంబంతో కలిసి తళుక్కుమన్నారు.

Advertisement

భర్త డొనాల్డ్ ట్రంప్ , కుమారుడు బారన్‌తో( Baron ) కలిసి కనిపించారు.తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆమె బయటకు వచ్చారు.ట్రంప్‌కు ఓటు వేసినట్లు మెలానియా వెల్లడించారు.

కుటుంబ సమేతంగా పామ్ బీచ్ మీదుగా మోర్టన్ అండ్ బార్బరా మాండెల్ రిక్రియేషన్ సెంటర్‌లో( Morton and Barbara Mandel Recreation Center ) ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.మెలానియా పబ్లిక్ లైఫ్‌కు దూరంగా వుండటంతో అనేక ఊహాగానాలు వినిపించాయి.

ఆమె ఎక్కువగా కుమారుడు బారన్‌తో గడుపుతున్నట్లుగా పలు నివేదికలు పేర్కొన్నాయి.

మార్చి 9న హంగేరి ప్రధాని విక్టర్ ఓర్బన్‌కు ( Prime Minister Viktor Orbán )ఆతిథ్యమిచ్చిన ట్రంప్‌తో కలిసి మార్ ఏ లాగో విందులో మెలానియా కనిపించారు.ఓర్బన్ .మెలానియాకు పుష్పగుచ్ఛాన్ని అందించినట్లు సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అయ్యాయి.ఈ ఏడాది జనవరిలో మెలానియా తల్లి అమలిజా నావ్స్ కన్నుమూసిన సంగతి తెలిసిందే.

రాజమౌళి వల్లే టాలీవుడ్ హీరోలకు ఈ స్థాయిలో గుర్తింపు.. నమ్మకపోయినా నిజమిదేనా?
ప్రియురాలి దారుణ హత్య .. యూకేలో భారత సంతతి వ్యక్తికి జీవిత ఖైదు

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె 78 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు.ఈ విషయాన్ని మెలానియా తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు.తన తల్లి వారసత్వాన్ని తాము కొనసాగిస్తామని మెలానియా పేర్కొన్నారు.

Advertisement

తల్లి మరణం తర్వాత ఆమె చాలా రోజుల వరకు కోలుకోలేకపోయారు.ఇప్పుడు భర్త ట్రంప్ కోసం మెలానియా బయటకు వస్తున్నారు.

తాజా వార్తలు