నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికల కోసం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మేకపాటి విక్రమ్ రెడ్డి

నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికల కోసం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మేకపాటి విక్రమ్ రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు.

ముందుగా దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ఆత్మకూరు లోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి, మాజీ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలతో సహా ర్యాలీగా ఆర్డీవో కార్యాలయానికి చేరుకుని రెండు సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు.వైసీపీ కార్యకర్తలు మేకపాటి అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు.

మేకపాటి కుటుంబంపై అభిమానంతో ఇక్కడ వరకు వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పారు మేకపాటి విక్రమ్ రెడ్డి.తమ కుటుంబంలో విషాదం జరిగిందని, ప్రజల్లో ఖచ్చితంగా మేకపాటి కుటుంబం నుంచి తాను ఉంటానని చెప్పారు.

దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఇచ్చిన హామీలు అన్నింటిని ఖచ్చితంగా నెరవేరుస్తానని వెల్లడించారు.ఎన్నికల్లో ఆత్మకూరు ప్రజలు తమకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.

Advertisement

ఆయనతో పాటు మంత్రులు , ఎంపీలు, మాజీ మంత్రులు మాట్లాడారు.ఆత్మకూరులో ఖచ్చితంగా గెలిచి తీరుతామని, రాబోయే ఎన్నికల్లో కూడా వైసీపీ మరో సారి అధికారం రాబోతుందని తెలిపారు.

నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి, కిలివేటి సంజీవయ్య, మానుగుంట మహేందర్ రెడ్డి, తదితర నేతలు మేకపాటి తో పాటు ర్యాలీలో పాల్గొన్నారు.ఇక ఆరో తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు సమయం ఉండగా.

ఇప్పటికే పలు పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్లు వేశారు.ప్రధాన ప్రతిపక్షం టిడిపి ఎన్నికలకు దూరంగా ఉంది.

బిజెపి నుంచి త్వరలో అభ్యర్థిని ప్రకటించనున్నారు.జనసేన మద్దతుతో బిజెపి అభ్యర్థి వైసీపీకి పోటీగా బరిలో లో ఉంటారు.కాగా ఈనెల 23వ తేదీన ఉప ఎన్నికలు జరుగుతాయి.26వ తేదీన కౌంటింగ్ నిర్వహిస్తారు.

ఎంతో టాలెంట్ ఉన్నా లక్ లేక వెనుకబడిన సత్యదేవ్.. లక్ కలిసిరావట్లేదా?
Advertisement

తాజా వార్తలు