మంచి రోజులు వచ్చాయి అంటోన్న మెహ్రీన్.. నిజమేనా?

టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న హీరోయిన్లలో మెహ్రీన్ పీర్జాదా కూడా ఒకరు.ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను అందుకోవడంలో సక్సెస్ అయ్యాయి.

 Mehreen Web Series Gets Title Locked-TeluguStop.com

ఇక ఆమె ప్రస్తుతం చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది.కాగా ఈ క్రమంలో ఆమె ప్రస్తుతం ఎఫ్3 చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే తాజాగా ఓ వెబ్ సిరీస్‌లో నటించేందుకు మెహ్రీన్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.ఇటీవల ‘ఏక్ మినీ కథ’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న యంగ్ హీరో సంతోష్ శోభన్‌తో కలిసి మెహ్రీన్ ఈ వెబ్ సిరీస్ చేయబోతుంది.

 Mehreen Web Series Gets Title Locked-మంచి రోజులు వచ్చాయి అంటోన్న మెహ్రీన్.. నిజమేనా-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇప్పటికే ప్రీప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ వెబ్ సిరీస్‌ను దర్శకుడు మారుతి తెరకెక్కించనుండటంతో ఈ వెబ్ సిరీస్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.ఇక ఈ వెబ్ సిరీస్‌లో మెహ్రీన్ పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండబోతుందని తెలుస్తోంది.

కాగా ఈ వెబ్ సిరీస్‌కు ఓ ఆసక్తికరమైన టైటిల్‌ను ఫిక్స్ చేశారట మేకర్స్.ఈ వెబ్ సిరీస్‌కు ‘మంచి రోజులు వచ్చాయి’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేయగా, అది ఈ కథకు పర్ఫెక్ట్‌గా యాప్ట్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు.

కాగా ఈ వెబ్ సిరీస్‌తో పాటు ఇతర ఆఫర్స్‌ను కూడా పరిశీలించే పనిలో అమ్మడు బిజీగా ఉందట.

అయితే ఈ ఏడాది మెహ్రీన్ పెళ్లి చేసుకోబోతున్నట్లు ఇటీవల వార్తలు రాగా, అమ్మడు తన పెళ్లిని వచ్చే ఏడాదికి వాయిదా వేసింది.

మరి థియేటర్ ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయిన మెహ్రీన్, డిజిటల్ ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుంటుందో తెలియాలంటే ఈ వెబ్ సిరీస్ రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నాయి సినీ వర్గాలు.అటు సంతోష్ శోభన్ కూడా ఈ వెబ్ సిరీస్‌తో తన కెరీర్‌కు బూస్ట్ దొరుకుతుందని చాలా ఆసక్తిగా ఉన్నాడు.

మరి మెహ్రీన్, సంతోష్ శోభన్‌లకు ఈ వెబ్ సిరీస్ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

#Mehreen #ManchiRojuli #Santosh Shoban

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు