చికాగో సెక్స్‌ రాకెట్‌.. మెహ్రీన్‌ బలి

అమెరికాలో తెలుగు వెండి తెర, బుల్లి తెర స్టార్స్‌ వ్యభిచారం సంచలనం సృష్టిస్తున్న విషయం తెల్సిందే.కిషన్‌ అనే వ్యక్తి చాలా సంవత్సరాలుగా అమెరికాలో తెలుగు నటీమణులతో వ్యభిచారం చేయిస్తూ పట్టుబడ్డాడు.

 Mehreen Responds About Allegations On Us Prostitution-TeluguStop.com

ప్రస్తుతం జైల్లో ఉన్న ఆ వ్యక్తి వ్యభిచారం చేయించిన విధానం తెలిసి పోలీసులే అవాక్కవుతున్నారు.పదుల సంఖ్యలో టాలీవుడ్‌ హీరోయిన్స్‌ పేర్లు బయటకు వస్తున్నాయి.

ఈ సమయంలోనే మెహ్రీన్‌ ట్విట్టర్‌లో ఒక పోస్ట్‌ పెట్టి బుక్‌ అయ్యింది.తన కుటుంబ సభ్యులతో అమెరికాకు వెళ్లిన సమయంలో అక్కడ పోలీసులు తనను అడ్డుకున్నట్లుగా మెహ్రీన్‌ ట్విట్టర్‌లో పేర్కొంది.

ప్రస్తుతం తెలుగు సినిమా హీరోయిన్స్‌పై అమెరికాలో ప్రత్యేక దృష్టి పెడుతున్నారని, అందుకే తాను హీరోయిన్‌ అని చెప్పగానే వారు నా గురించి విచారణ జరిపారు, అమెరికా ఎందుకు వచ్చారు అంటూ ప్రశ్నించారు.తాను అదే సమయంలో వారి ద్వారా సెక్స్‌ రాకెట్‌ గురించి తెలుసుకున్నాను.నన్ను ప్రశ్నించిన అధికారులు నా గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత క్షమాపణలు చెప్పి పంపించారు అంటూ గతంలో ట్విట్టర్‌లో మెహ్రీన్‌ పోస్ట్‌ చేసింది.అయితే ఆ విషయాన్ని కొన్ని మీడియా సంస్థలు వక్రీకరించారు.

ప్రముఖ జాతీయ దిన పత్రికలో తాజాగా ఆ విషయమై కథనం రావడం జరిగింది.

మెహ్రీన్‌ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సెక్స్‌ రాకెట్‌ విషయం గురించి స్పందించిందని, సెక్స్‌ రాకెట్‌లో ఆమెకు కూడా భాగస్వామ్యం ఉండి ఉంటుందనే అనుమానం కలిగేలా ఆ కథనంలో పేర్కొనడం జరిగింది.

దాంతో మెహ్రీన్‌కు తీవ్ర ఆగ్రహం కలిగింది.తాను అనని విషయాల గురించి రాద్దాంతం చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.

నేను నా కుటుంబంతో అమెరికాలో ఎదుర్కొన్న విషయాన్ని గురించి చెబితే పలువురు పలు రకాలుగా అర్థం చేసుకుంటున్నారు అంటూ మెహ్రీన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది.

తాజాగా ఈ అమ్మడు ‘పంతం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతుంది.

‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ అమ్మడు వరుసగా చిత్రాల్లో నటిస్తూ దూసుకు పోతుంది.మెల్ల మెల్లగా స్టార్‌ హీరోలకు జోడీగా ఈమె నటిస్తూ ఉంది.

భవిష్యత్తులో ఈ అమ్మడు మరింత స్టార్‌డంను దక్కించుకోవడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు నమ్మకంగా ఉన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube