కాబోయే భర్తతో మెహ్రీన్ ఫోటోషూట్.. నెట్టింట వైరల్..!

హీరోయిన్ల కెరీర్ తొందరగా ముగిసిపోతుంది.అందుకే హీరోయిన్స్ బిజీగా ఉన్నన్ని రోజులు పెళ్లి గురించి ఆలోచించారు.

 Mehreen Pre Wedding Photoshoot Goes Viral, Mehrene Kaur Pirzada, Bhavya Bishnoi,-TeluguStop.com

కానీ మెహ్రీన్ మాత్రం అలా కాదు.మెహ్రీన్ పిర్జాదా వరస ఆఫర్లు వస్తున్న సమయంలోనే పెళ్లి చేసుకోబోతుంది.

ఈమె హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనుమడు తో పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధం అయ్యింది.హర్యానా కాంగ్రెస్ లీడర్ అయినా భవ్య బిష్నోయ్ ను వివాహం చేసుకోవడానికి రెడీ అయిపొయింది.

వీరిద్దరిది ఇప్పటికే ఎంగేజ్ మెంట్ కూడా పూర్తి అయ్యింది.మార్చి 12 న జైపూర్ లోని ఆలియా ఫోర్ట్ లో ఎంగేజ్ మెంట్ జరిగింది.త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న జంట ప్రీ వెడ్డింగ్ షూటింగ్ జరుపుకుంది.ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇప్పటికే మెహ్రీన్ తనకు కాబోయే భర్తతో దిగిన ఫోటోలు చాలా సార్లు వైరల్ అయ్యాయి.

తాజాగా ఈ జంట ట్రెడిషనల్ లుక్ లో ఫోటోలు దిగారు.

ఈ లుక్ లో కాబోయే దంపతులు చూడముచ్చటగా కనిపిస్తున్నారు.ఈ ఫోటోలు ఇప్పుడు యువతను బాగా ఆకట్టుకుంటున్నాయి.

త్వరలోనే పెళ్లితో ఒక్కటి కాబోతున్న జంటకు అందరు కంగ్రాట్స్ చెబుతూ తమ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఇది ఇలా ఉండగా మెహ్రీన్ ప్రస్తుతం F3 సినిమాలో నటిస్తుంది.

Telugu Bhavya Bishnoi, Mehreenpre, Mehrenekaur, Pre-Movie

ఈ సినిమాలో వెంకటేష్, వరుణ్ తేజ్ లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.ఈ సినిమా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతుంది.ఇది F2 సీక్వెల్ గా వస్తుంది. F2 సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలుసు.సినిమాలో మెహ్రీన్ తో పాటు తమన్నా కూడా హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు.

అయితే ప్రస్తుతం కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube