హాట్ గురూ : సిమ్మింగ్ ఫూల్ లో ఈత కొడుతున్న వీడియోని షేర్ చేసిన మెహరీన్....

తెలుగులో నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన “కృష్ణ గాడి వీర ప్రేమ గాధ” అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకి హీరోయిన్ గా పరిచయమైన ముంబై బ్యూటీ “మెహరీన్ పిర్జాడ” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ అమ్మడు వచ్చీరావడంతోనే తన అందం, అభినయం, నటనా ప్రతిభతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకోవడంతో వరుసగా సినిమా అవకాశాలు దక్కించుకుంది.

 Mehreen Pirzada Looks Stunning Swim Attire, Mehreen Pirzada, Telugu Heroine, Swi-TeluguStop.com

ఈ క్రమంలో తమిళం, మలయాళం, పంజాబీ హిందీ తదితర భాషలలో నటించింది.కానీ ఈ మధ్యకాలంలో మెహరీన్ నటించిన చిత్రాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోతున్నాయి.

దీంతో సినిమా అవకాశాలు సన్నగిల్లడంతో తన వైవాహిక జీవితంపై దృష్టి సారించింది.ఈ క్రమంలో భవ్య బిష్ణోయ్ అనే యువ రాజకీయ వేత్తని పెళ్లి చేసుకోవాలనుకుంది.అంతేకాకుండా ఈ క్రమంలో నిశ్చితార్థం కూడా చేసుకుంది.కానీ అనుకోకుండా ఇటీవలే వీరిద్దరి అభిరుచులు కలవకపోవడంతో పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది.

దీంతో మళ్లీ తన సినీ జీవితం పై దృష్టి సాధించింది.

ఈ మధ్యకాలంలో మెహరీన్ సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటోంది.

కాగా ఆ మధ్య కొంత మేర బరువు పెరగడంతో ఈ అమ్మడికి అవకాశాలు కరువయ్యాయి.దీంతో వెంటనే తేరుకున్న మెహరీన్ బరువు తగ్గే పనిలో పడింది.ఈ క్రమంలో ఎక్కువ సమయం జిమ్ లో వర్కౌట్లు చేస్తూ మళ్లీ బాగానే బరువు తగ్గింది.దీంతో ప్రస్తుతం ఈ అమ్మడికి సినిమా అవకాశాలు ఆగని క్యూ కడుతున్నాయి.

కాగా తాజాగా మెహరీన్ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అయితే ఇందులో మెహరీన్ స్విమ్మింగ్ పూల్ లో ఈత కొడుతుండగా తీసిన ఫోటోలను మరియు వీడియోని షేర్ చేసింది.

అయితే ఈ ఈ వీడియో ని షేర్ చేసిన అతి కొద్ది సమయంలోనే దాదాపుగా లక్ష మంది పైచిలుకు నెటిజన్లు లైక్ చేశారు.అంతేకాకుండా పెళ్లి తెగతెంపులు చేసుకున్న తర్వాత మెహరిన్ సినిమా అవకాశాల కోసం బాగానే శ్రమిస్తూ ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరికొందరైతే ఈమధ్య మెహరిన్ గ్లామర్ డోస్ పెంచిందంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం మెహారీన్ తెలుగులో రెండు చిత్రాలలో హీరోయిన్ గా నటిస్తోంది.అయితే ఇందులో అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న “ఎఫ్ 3” చిత్రం ఇప్పటికే దాదాపుగా 50 శాతం షూటింగ్ పనులు పూర్తి చేసుకున్నట్లు సమాచారం.అలాగే ప్రముఖ దర్శకుడు దాసరి మారుతి దర్శకత్వం వహిస్తున్న “మంచిరోజులు వచ్చాయి” ఈ చిత్రంలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube