సినిమాలకు గుడ్‌బై చెప్పిన బ్యూటీ.. ఎవరో తెలుసా?

టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన తరువాత తమ కెరీర్‌ను బిల్డ్ చేసుకోవడంలో చాలా మంది వెనకబడి పోవడంతో వారు త్వరగా ఫేడవుట్ అవుతుంటారు.ఇప్పుడు ఇదే కోవలోకి తాజాగా ఓ బ్యూటీ వచ్చి చేరింది.

 Mehreen Pirzada Good Bye To Movies, Mehreen Pirzada, Tollywood News, F2, Movies-TeluguStop.com

నేచురల్ స్టార్ నాని నటించిన కృష్ణగాడి వీర ప్రేమగాధ చిత్రంతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన మెహ్రీన్ పీర్జాదా ఆ సినిమాతో మంచి గుర్తింపును తెచ్చుకుంది.ఆ తరువాత వరుసబెట్టి ఆఫర్లు వచ్చినా, అమ్మడి సెలెక్షన్ మాత్రం ఆమెకు కలిసి రాలేదు.

దీంతో వరుసగా ఫెయిల్యూర్ సినిమాలు చేస్తూ ఫేడవుట్ అయ్యేందుకు ఈ బ్యూటీ రెడీ అయ్యింది.కాగా బాలీవుడ్‌లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్న ఈ బ్యూటీ, అక్కడ కూడా బొక్కబోర్లా పడింది.

దీంతో టాలీవుడ్‌లోనే ఎఫ్2 చిత్రంతో అదిరిపోయే సక్సెస్ అందుకున్న ఈ బ్యూటీ, ఆ తరువాత వరుసబెట్టి ఆఫర్లు వస్తాయని అందుకుంది.కానీ ఆమె అనుకున్నట్లు జరగలేదు.

ఎఫ్ 2 సక్సెస్ ఆమెకు ఏమాత్రం కలిసి రాలేదు.దీంతో ప్రస్తుతం చేతిలో సినిమాలేవీ లేకపోవడంతో అమ్మడు ఇక సినిమాలకు గుడ్ బై చెప్పేందుకు రెడీ అయ్యిందట.

అయితే సినిమా ఛాన్సులు లేకపోవడంతో ప్రస్తుతం వెబ్ సిరీస్‌లు, ఓటీటీ కంటెంట్‌ల కోసం ఆమె చూస్తున్నట్లు తెలుస్తోంది.ఇతర భాషల్లో పలు అవకాశాలు వస్తున్నాయని, అందుకే సినిమాలకు గుడ్ బై చెప్పి డిజిటల్ ప్లాట్‌ఫాంలపై ఎంట్రీ ఇవ్వాలని ఈ బ్యూటీ చూస్తున్నట్లు తెలుస్తోంది.

మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే మాత్రం అమ్మడు నోరు విప్పేవరకు ఆగాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube