యూఎస్‌ సెక్స్‌ రాకెట్‌.. మెహరీన్‌కు సంబంధం ఏంటీ?       2018-06-18   00:52:49  IST  Raghu V

టాలీవుడ్‌ను కుదిపేస్తున్న చికాగో టాలీవుడ్‌ సెక్స్‌ రాకెట్‌ వ్యవహారంలో ఎవరి పేర్లు బయటకు వస్తాయో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఒకరి పేరు దాదాపుగా బయటకు వచ్చేసింది. మెగా హీరోతో ఎక్కువ సినిమాలు చేసిన హీరోయిన్‌ అనగానే ఆమె పేరును అంతా గుర్తిస్తున్నారు. ఇక త్వరలోనే మరో ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్‌ పేర్లు కూడా బయటకు వస్తాయనే ప్రచారం సినీవర్గాల్లో జరుగుతుంది. అమెరికా పోలీసులు ప్రస్తుతం ఆ హీరోయిన్స్‌ను ఫోన్‌ ద్వారా విచారించేందుకు ప్రయత్నిస్తున్నారు. కాని ఆ హీరోయిన్స్‌ మాత్రం అజ్ఞాతంలోకి వెళ్లి పోయినట్లుగా తెలుస్తోంది.

మరో వైపు అమెరికాకు షూటింగ్‌ నిమిత్తం లేదా ఇతరత్ర అవసరాల నిమిత్తం, వ్యక్తిగత కారణాల నిమిత్తం అమెరికాకు వెళ్తున్న తెలుగు హీరోయిన్స్‌కు మరియు ఇతర సౌత్‌ హీరోయిన్స్‌కు అక్కడ కష్టాలు ఎదురవుతున్నాయి. ఇండియా నుండి వస్తున్నాను, హీరోయిన్‌ను అంటే అక్కడ ఇమిగ్రేషన్‌ అధికారులు కళ్లల్లో బూతద్దాలు పెట్టుకుని మరీ వారిని ఎంక్వౌరీ చేసి మరియు వారికి సంబంధించిన పూర్తి వివరాలను తీసుకుని మరీ వదిలేస్తున్నారు. ఈ పరిణామాలు ప్రస్తుతం హీరోయిన్స్‌కు ఇబ్బందికరంగా దాపరించాయి.

కృష్ణగాడి వీర ప్రేమ గాథ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయిన మెహ్రీన్‌ తక్కువ సమయంలోనే ఎక్కువ సినిమాలు, అది కూడా స్టార్స్‌కు జోడీగా ఈమె చిత్రాలు చేయడంతో స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు దక్కించుకుంది. అలాంటి మెహ్రీన్‌ తాజాగా అమెరికా వెళ్లింది. తన తల్లిదండ్రులను కలిసేందుకు తరచుగా అమెరికా వెళ్లే మెహ్రీన్‌ తాజాగా కూడా తల్లిదండ్రులను చూసేందుకు అక్కడకు వెళ్లింది. గతంలో ఎప్పుడు లేని విధంగా తనను ఏకంగా ఆరు గంటల పాటు విచారించారు అని, తానో హీరోయిన్‌ను అంటూ చెప్పగానే తనను ఒక దోషిని చూసినట్లుగా చూస్తూ విచారణ చేపట్టారు అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

మొత్తానికి చికాగో టాలీవుడ్‌ సెక్స్‌ రాకెట్‌ వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది. సౌత్‌ హీరోయిన్స్‌ అంతా కూడా ప్రస్తుతం దోషులుగానే అంతర్జాతీయ సమాజానికి కనిపిస్తున్నారు. ఎవరో కొందరు చేసిన తప్పు వల్ల ప్రస్తుతం అంతా కూడా బలి అవుతున్నారు అంటూ సినీ వర్గాల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక అమెరికా సెక్స్‌ రాకెట్‌లో ఉన్న హీరోయిన్స్‌ను తాము దోషులుగా భావించడం లేదని, బాధితురాల్లుగా వారిని తాము భావిస్తున్నట్లుగా పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. అయినా కూడా ఏ హీరోయిన్‌ తాము సెక్స్‌ రాకెట్‌లో ఉన్నట్లుగా ముందుకు వచ్చి చెప్పే సాహసం చేయడం లేదు.