అయ్యో పాపం : హనీ పాప ని ఆ సీక్వెల్ నుంచి తొలగించారట....

తెలుగులో నేచురల్ స్టార్ నాని నటించిన కృష్ణాగాడి వీర ప్రేమ గాథ చిత్రంతో తెలుగు సినిమా పరిశ్రమకి పరిచయమైన ముద్దు గుమ్మ మెహరీన్ కౌర్ పిర్జాడ తెలుగు ప్రేక్షకులకు తన అందచందాలతో బాగానే దగ్గరయ్యింది.అయితే వచ్చి రావడంతో ఈ అమ్మడు స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు దక్కించుకున్నప్పటికి తన నటనను నిరూపించుకునేనందుకు సరైన అవకాశం రాకపోవడంతో అవకాశాల కోసం సినీ పరిశ్రమలో కొంత మేర ఇబ్బందులు ఎదుర్కొంటోంది.

 Mehreen Kaur Pirzada, Tollywood Actress, F3 Movie News, Anil Ravipudi, Tollywood-TeluguStop.com

గత ఏడాది ఈ అమ్మడు నటించిన టువంటి ఎఫ్2 చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించింది.ముఖ్యంగా ఈ చిత్రంలో మెహరీన్ “హనీ ఈజ్ ద బెస్ట్” అంటూ చెప్పే డైలాగ్ తో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.

అయితే తాజా సమాచారం ప్రకారం దర్శకుడు అనిల్ రావిపూడి ఈ చిత్రానికి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడట.అయితే  ఈ చిత్రంలో మెహరీన్ స్థానంలో వేరొక హీరోయిన్ ని తీసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారని పలువురు చర్చించుకుంటున్నారు.

దీంతో హనీ పాప అభిమానులు తీవ్ర నిరాశలో మునిగి పోయారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం మెహరిన్ చేతిలో టాలీవుడ్ కు సంబంధించి కొత్త చిత్రాలు ఏవీ లేవు.

దీంతో ఈ అమ్మడు ప్రస్తుతం వెబ్ సిరీస్ లో నటించేందుకు ఒప్పుకున్నట్లు సమాచారం. అయితే గ్లామర్ పరంగా మంచి అవకాశాలు దక్కించుకున్నటువంటి మెహరీన్ ఒక్కసారిగా అవకాశాలు లేకపోవడంతో వెబ్ సీరీస్ వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే ఇప్పటికే టాలీవుడ్ కి సంబందించినటువంటి హీరోయిన్ హరిప్రియ, సమంత అక్కినేని, తదితరులు ఈ వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube