బాలకృష్ణ మూవీపై క్లారిటీ ఇచ్చిన మెహరీన్

యంగ్ బ్యూటీ మెహరీన్ ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ పాపులర్ హీరోయిన్ గా కొనసాగుతుంది.స్టార్ హీరోలతో జత కడుతూ వరుస సినిమాలు చేస్తుంది.

 Mehreen Gives Clarity On Balakrishna Movie, Tollywood, Akhanda Movie, Gopichand-TeluguStop.com

సక్సెస్ లని తన ఖాతాలో వేసుకొని దూసుకుపోతుంది.ఇక ప్రస్తుతం తన ప్రియుడుతో పెళ్లి పీటలు ఎక్కేందుకు ఓ వైపు ఈ అమ్మడు రెడీ అవుతుంది.

మరో వైపు ఎఫ్3 మూవీలో కూడా నటిస్తుంది.దీంతో పాటు రీసెంట్ గా మారుతి దర్శకత్వంలో సంతోష్ శోభన్ హీరోగా స్టార్ట్ అయిన కొత్త సినిమాలో కూడా మెహరీన్ హీరోయిన్ గా ఖరారైంది.

ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం నడుస్తుంది.అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతుందని తెలుస్తుంది.

ఇదిలా ఉంటే గత కొద్ది రోజులుగా మెహరీన్ కి సంబంధించి ఒక హాట్ న్యూస్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది.

Telugu Akhanda, Balakrishna, Maruti, Mehreen, Santosh Sobhan, Tollywood-Movie

బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో మెహరీన్ ని హీరోయిన్ గా ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతుంది.బాలయ్యకి జోడీగా ఈ యంగ్ బ్యూటీ నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని గట్టిగా వినిపిస్తుంది.అంతకు ముందు వరకు శ్రుతి హాసన్ పేరు బాలకృష్ణ, గోపీచంద్ మూవీ కోసం వినిపించింది.

ఉన్నపళంగా మెహరీన్ పేరు తెరపైకి వచ్చింది.ఈ నేపధ్యంలో మెహరీన్ ఈ ప్రచారంపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.

తాను ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో సంతోష్ శోభన్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో మాత్రమే నటిస్తున్నా అని స్పష్టం చేసింది.మరి ఏ ఇతర కొత్త చిత్రాలలో తాను భాగస్వామ్యం కాలేదని తెలిపింది.

ఒక వేళ ఏదైనా సినిమాలో నటిస్తే ఆ విషయాన్ని నేనే నేరుగా చెబుతానని, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని పేర్కొంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube