అనుష్కని కలవడం తన కల అంటున్న మెహరీన్

ప్రతి హీరోయిన్ కి ఏదో ఒక కల ఉంటుంది.కొందరు డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యానని చెబుతారు.

 Mehreen Dream To Meet Anushka, Tollywood, Telugu Heroines, South Indian Beauties-TeluguStop.com

మరికొందరు సైకాలజీ చదివి మనుషుల ఆలోచనలు తెలుసుకోవాలనుకుంటే యాదృచ్చికంగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టా అని చెబుతారు.అలాగే కొంత మంది హీరోయిన్స్ పలానా స్టార్ హీరోకి జోడీగా నటించడం తన డ్రీమ్ అంటూ ఉంటారు.

స్టార్ హీరోతో జత కట్టే అవకాశం రావడం అంటే కచ్చితంగా వాళ్ళు స్టార్ హీరోయిన్ స్థాయికి వెల్లిపోయినట్లే.ఇలా ఒక్కో హీరోయిన్ కి ఒక్కో డ్రీమ్ ఉంటుంది.

అయితే ఈ విషయంలో మెహరీన్ మాత్రం తన డ్రీమ్ గురించి చాలా ప్రత్యేకంగా చెప్పింది.నిశ్చితార్ధం తరువాత పెళ్లి రద్దు చేసుకొని మళ్ళీ సినిమాల మీద ఫోకస్ పెట్టిన ఈ పంజాబీ బ్యూటీ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో సంతోష్ శోభన్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తుంది.

అలాగే ఎఫ్3 మూవీలో కూడా నటిస్తుంది.ఈ రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.

ఇదిల ఉంటే తాజాగా ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకుంది.తనకి ఊహ తెలిసినప్పటి నుంచి అనుష్క శెట్టిని చూస్తున్నా అని, ఆమె అంటే తనకి విపరీతమైన అభిమానం అని పేర్కొంది.

ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఆమెతో ఒక్కసారైనా కలిసి మాట్లాడే అవకాశం వస్తే బాగుండు అనుకున్నా అని, ఆ అవకాశం మహానుభావుడు ప్రీరిలీజ్ ఈవెంట్ సందర్భంగా వచ్చిందని చెప్పింది.అలాగే సల్మాన్ ఖాన్ ని కలిసి మాట్లాడే అవకాశం రావాలని కోరుకుంటే అది కూడా సాధ్యమయింది అని పేర్కొంది.

మొత్తానికి తన ఫేవరేట్ హీరో, హీరోయిన్స్ ని కలిసి మాట్లాడటం మెహరీన్ డ్రీమ్ గా పెట్టుకోవడం నిజంగా విశేషం అని చెప్పాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube