వదిలేసి తప్పుచేశా.. లేకపోతే నా జీవితం మరోలా ఉండేదంటున్న మెహ్రీన్!

టాలీవుడ్ లో మెహ్రీన్ కౌర్ నాని కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమా తో ఎంట్రీ ఇచ్చింది.అతి తక్కువ సమయం లోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుని వరస అవకాశాలు అనుకుంటుంది.

 Mehreen Doing Big Mistake Shocking Comments, Mehreen Kaur Pirzada, F3 Movie, Varun Tej, Venkatesh , Tamanna, Ani Ravipudi-TeluguStop.com

తెలుగు లోనే కాకుండా మిగతా భాషల్లో కూడా అడపా దడపా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటుంది.అయితే ఈ సినిమా తర్వాత ఈ అమ్మడు కొన్ని కారణాల వల్ల మంచి మంచి ఆఫర్ వస్తే వదిలేసుకుంది.

కానీ ఈమె ఒప్పుకున్న ఆఫర్స్ మాత్రం అంతగా సఫలం అవ్వలేదు.ఈమె చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ రేంజ్ లో ఒక్కటి కూడా హిట్ కాకపోవడంతో ఈ అమ్మడి కెరీర్ అట్టర్ ప్లాప్ గా మిగిలి పోయింది.

 Mehreen Doing Big Mistake Shocking Comments, Mehreen Kaur Pirzada, F3 Movie, Varun Tej, Venkatesh , Tamanna, Ani Ravipudi-వదిలేసి తప్పుచేశా.. లేకపోతే నా జీవితం మరోలా ఉండేదంటున్న మెహ్రీన్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అదే టైం లో ఈ అమ్మడిని అనిల్ రావిపూడి ఎఫ్ 2 సినిమాతో కాపాడాడు.ఈ సినిమాలో ఈమెకు అవకాశం ఇచ్చి సూపర్ హిట్ అందించాడు.

ఈ సినిమాలో ఈమె హానీ పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించింది.

వరుణ్ కంత్రి గర్ల్ ఫ్రెండ్ గా ఈమె మెప్పించిన తీరు అందరిని ఆకట్టుకుంది.

ఇక ఇప్పుడు కూడా ఈమె హిట్ లేక ఫామ్ కోల్పోయి బాధపడుతుంటే ఎఫ్ 3 అవకాశం ఇచ్చి మళ్ళీ ఈమెను ఫామ్ లోకి తీసుకు రాబోతున్నాడు అనిల్.మెహ్రీన్ ప్రస్తుతం F3 సినిమా లో నటిస్తుంది.

ఈ సినిమాలో వెంకటేష్, వరుణ్ తేజ్ లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.ఈ సినిమా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెహ్రీన్ తో పాటు తమన్నా కూడా హీరోయిన్ గా నటిస్తుంది.

ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు.

మరి ఈ సినిమా మే 27న రిలీజ్ అవ్వబోతున్న నేపథ్యంలో ప్రొమోషన్స్ స్టార్ట్ చేసారు.ఈ ప్రొమోషన్స్ లో భాగంగా మెహ్రీన్ తాను కోల్పోయిన ఆఫర్ గురించి చెప్పుకొచ్చింది.ఈమెకు కెరీర్ స్టార్టింగ్ లో అల్లు అర్జున్ తో అవకాశం వస్తే కొన్ని కారణాల వల్ల వదులుకుందట.

అది అల్లు అర్జున్ బోయపాటి కాంబోలో వచ్చిన సరైనోడు సినిమా అని అందులో రకుల్ ప్రీత్ కు బదులుగా ఈమెకు ఆఫర్ వచ్చిందట.కానీ ఈ సినిమా ఆమె రిజక్ట్ చేసిందట.

అప్పుడు రిజక్ట్ చేయకపోయి ఉంటే తన కెరీర్ జీవితం వేరేలా ఉండేదని ఇప్పుడు గుర్తు చేసుకుని బాధ పడింది.మరి ఈ అమ్మడికి ఎఫ్ 3 సినిమా అయినా ఆఫర్స్ ను తెచ్చిపెడుతుందేమో చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube