మెగాస్టార్ చిరంజీవి ఆచార్య తరువాత వరుసగా రెండు రిమేక్ సినిమాలని లైన్ లో పెట్టారు.అందులో మలయాళీ హిట్ మూవీ లూసీఫర్ ఒకటి కాగా, అలాగే తమిళ్ హిట్ మూవీ వేదాళం రీమేక్ ఒకటి.
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ఆచార్య మూవీ షూటింగ్ దశలో ఉంది.ఇప్పటికే అరవై శాతం షూటింగ్ ఈ సినిమా పూర్తి చేసుకుంది.
ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్నా ఇంకా చిరంజీవి షూటింగ్ సెట్ లో జాయిన్ కాలేదు.ఇదిలా ఉంటే లూసీఫర్ రీమేక్ కి సంబంధించి దర్శకులు మారిపోతున్నారు.
చిరంజీవి అంచనాలని అందుకోలేక సుజిత్, వివి వినాయక్ చేతులెత్తేశారు.ఇప్పుడు తమిళ్ స్టార్ దర్శకుడు లూసీఫర్ కోసం రంగంలోకి వచ్చాడు.
ఇదిలా ఉంటే వేదాళం సినిమా మెహర్ రమేష్ దర్శకత్వంలో చేయబోతున్నాడు.ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఇప్పటికే స్టార్ట్ అయ్యింది.
ఇదిలా ఉంటే ఆచార్య షూటింగ్ పూర్తి చేసిన వెంటనే వేదాళం రీమేక్ స్టార్ట్ చేయాలని మెగాస్టార్ అనుకుంటున్నారు.అయితే ఆచార్య ఎప్పటికి పూర్తవుతుంది అనేది ఇప్పుడు సందేహాస్పదంగా ఉంది.అయితే మెహర్ రమేష్ మాత్రం ముందుగా షూటింగ్ స్టార్ట్ చేసి చిరంజీవి లేని సన్నివేశాలు పూర్తి చేయాలని అనుకుంటున్నాడు.ఏప్రిల్ నెలలో షూటింగ్ స్టార్ట్ చేసి నెల రోజుల్లో చిరంజీవి లేని సన్నివేశాలు పూర్తి చేస్తే మే నెలలో చిరంజీవి పాల్గొన్న తర్వాత అతని సన్నివేశాలు వరుసగా సింగిల్ షెడ్యూల్ లో పూర్తి చేయాలని అనుకుంటున్నారు.
దీనికి సంబంధించి ఇప్పటి నుంచి షెడ్యూల్ ప్లానింగ్ చేసుకుంటున్నాడు.ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ భామని లేదంటే ఒరిజినల్ వెర్షన్ లో నటించిన శృతి హాసన్ ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది.