మాజీ ముఖ్య మంత్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్ చిరు.... 

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇటీవల కాలంలో సోషల్ మీడియా మాధ్యమం అయినటువంటి ట్విట్టర్ లో ఖాతా తెరిచిన సంగతి అందరికీ తెలిసిందే.దీంతో సోషల్ మీడియాలో మెగాస్టార్ చిరంజీవి తెగ యాక్టివ్ గా ఉంటున్నారు.

 Megsatar Chiranjeevi, Tollywood, Tdp,  Birthday Wishes, Nara Chandrababu Naidu,-TeluguStop.com

అంతేకాక పలు అంశాలపై కూడా స్పందిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

అయితే తాజాగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు 70వ పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

అలాగే “అహర్నిశం ప్రజా సేవలో దశాబ్దాలుగా కొనసాగుతున్న మీ సంకల్పబలం అనితరసాధ్యం.కలకాలం మీకు సంతోషం, ఆరోగ్యం ప్రసాదించమని ఆ భగవంతుని కోరుతున్నాను.” అంటూ తన ట్వీట్ లో పేర్కొన్నారు.

అలాగే చంద్రబాబు నాయుడికి వైఎస్సార్సీపీ పార్టీ వ్యవస్థాపకుడు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు.

అంతేగాక ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలని అలాగే ఆరోగ్యంతో కలకాలం ఆయన జీవించాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నటువంటి “ఆచార్య” అనే చిత్రంలో నటిస్తున్నాడు.

ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించినటువంటి చిత్రీకరణ పనులు మొదలవగా ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా కొంత కాలం పాటు ఈ చిత్రానికి సంబంధించి నటువంటి షూటింగ్ పనులు వాయిదా వేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube