అమెరికన్ ఫోర్బ్స్ జాబితాలో తెలుగమ్మాయి..  

  • అమెరికాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఫోర్బ్స్ జాబితా లోకి పశ్చిమ గోదావరి జిల్లాకి చెందిన అత్తిలి మండలం ఉనికులి గ్రామానికి చెందిన మేఘన నిలిచారుఈ నెలలో ప్రచురించిన ఈ మ్యాగజైన్లో అండర్ -30 శాస్త్రవేత్తల విభాగంలో ఆమె చోటు దక్కించుకున్నారుఅత్యంత ప్రతిభా వంతురాలిగా గురించిన ఆమెకి ఈ అవకాశం దక్కిందని ఆమె తల్లి తండ్రులు తెలిపారు

  • Meghana Bollimpalli Gets Place In Forbes 30 Under List-Meghana Nri Telugu Nri News Updates

    Meghana Bollimpalli Gets Place In Forbes 30 Under 30 List

  • అయితే ఏకంగా ఒక తెలుగమ్మాయి అందులోని తమ జిల్లా వాసి అయిన అమ్మాయి కావడంతో పశ్చిమ ప్రజలు ఆమెకి అభినందనలు తెలుపుతున్నారుఅయితే తల్లిదండ్రులతో కలిసి మేఘన అమెరికాలోని ఆర్క్‌నెస్‌ స్టేట్‌ లిటిల్‌ రాక్‌లో ఉంటోంది…సెంట్రల్ స్కూల్ లో విద్యని అభ్యసిస్తున్న ఆమెకి సైన్సు అంటే ఎంతో ఆసక్తి కావడంతో ఆమెని చిన్నతనం నుంచీ తల్లి తండ్రులు ప్రోత్సాహం ఇస్తూ వచ్చారని అన్నారు ఆమె తల్లి తండ్రులు

  • Meghana Bollimpalli Gets Place In Forbes 30 Under List-Meghana Nri Telugu Nri News Updates
  • ఇదిలాంటే2018 మేలో ప్రపంచస్థాయిలో ఐసెఫ్‌ సంస్థ నిర్వహించిన సైన్స్‌ ఫేర్‌ పోటీల్లో 75 దేశాలతో పోటీపడి ఒక సైన్స్ పోటీ ప్రదర్సన లో ఐసెఫ్‌ అవార్డు గెలుపొందింది…ఆ సందర్భంగా మేఘన అవార్డుతో పాటు 50 వేల డాలర్ల బహుమతి పొందినట్లుగా ఆమె తల్లి తండ్రులు తెలిపారు

  • Meghana Bollimpalli Gets Place In Forbes 30 Under List-Meghana Nri Telugu Nri News Updates
  • ఏది ఏమైనా తెలుగు అమ్మాయి అమెరికాలో ఫోర్బ్స్ జాబితాలో స్థానం సంపాదించడంతో తెలుగు ఎన్నారైలు అభినందనలు తెలుపుతున్నారు.