ఇకపై వారు ఇంట్లోనే వైన్ తయారీ చేయడానికి సర్కార్ పర్మిషన్... ఆపై మార్కెట్ లో కూడా అమ్మకం..!

మామూలుగా ఎప్పుడైనా వైన్ తాగాలంటే మనము వైన్ షాప్ కి వెళ్లి కొనాల్సిన అవసరం ఉండేది.అయితే ఇక నుండి ఆ రాష్ట్రంలో మాత్రం షాప్ కు వెళ్లి కొనాల్సిన అవసరం లేదు.

 Homemade Fruit Wine In Meghalaya , Meghalaya , Homemade Fruit Wine , Wine Makers-TeluguStop.com

మన భారతదేశంలోని మేఘాలయ రాష్ట్రంలో ప్రజలకి ఎంచక్కా వారి ఇంట్లోనే వైన్ తయారు చేసుకోవచ్చని ఆ రాష్ట్ర ప్రభుత్వం వారికి పర్మిషన్ ఇచ్చింది.నిజంగా ఇది వైన్ ప్రియులకు శుభవార్త అని చెప్పవచ్చు.

ఇక దీంతో ఇప్పుడు వారు ఎలాంటి వైన్ తయారు చేయాలి.? దాని కోసం ఎలాంటి ద్రాక్ష ఉపయోగించాలి…? అని వెతకడం మొదలుపెట్టారు.వీటితోపాటు వైన్ తయారు చేయడానికి ఎలాంటి పదార్థాలు కావాలని వాటిని ఎలా సమకూర్చుకోవాలని వాటిపై కూడా దృష్టి పెట్టారు.ఎలాంటి పదార్థాలు వాడితే టేస్టీ టేస్టీ వైన్ తయారు చేయవచ్చు అని ఆలోచనలు చేస్తున్నారు.

ఇకపై వారు ఇంట్లోనే హ్యాపీగా వైన్తయారు చేసుకొని తాగవచ్చు.అంతేకాదండోయ్… వారు తయారుచేసిన వైన్ బయట మార్కెట్లో కూడా అమ్ముకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.అయితే వీటికి ఎటువంటి టాక్స్ కట్టనవసరం లేదని ప్రభుత్వం తెలియజేసింది.ఇంకేముంది ఆ రాష్ట్ర ప్రజలు ప్రభుత్వానికి జేజేలు కొడుతున్నారు.ఇక్కడ ఇంకో అదిరిపోయే విషయం ఏమిటంటే ఇలా తయారు చేసే అమ్ముకోవడానికి ప్రజలు ఎటువంటి టాక్స్ లో లాంటివి ప్రభుత్వానికి చెల్లించాల్సిన అవసరం లేదని వారికి తెలియజేసింది.

అయితే, వీటిని తయారు చేసుకోవడానికి మాత్రం మొదట్లో లైసెన్స్ కోసం ఒక్కసారి ప్రభుత్వానికి రూ.7500 చెల్లించి రశీదు పొందిన వారు తయారుచేసుకొని అమ్ముకోవచ్చని తెలిపింది.స్థానికంగా అక్కడ గత రెండు దశాబ్దాలుగా ఉన్న డిమాండ్ ను ఈ ప్రభుత్వం నెరవేరిందని మేకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మైకేల్ తెలియజేశారు.

ఇలా ఇళ్లల్లోనే వైన్ తయారు చేసి అమ్ముకోవడానికి అనుమతి ఇవ్వడం ద్వారా వైన్ ఉత్పాదకత పెరగడంతోపాటు, స్థానికులకు అధిక ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సంగ్మా తెలియజేశారు.తాజాగా కేబినెట్ ఆమోదించిన ఏడు అజెండాలో ఈ హోం మేడ్ ఫ్రూట్ వైన్ తయారీకి సంబంధించి అనుమతి ఇవ్వడంతో మేఘాలయ లోని వైన్ తయారు చేసే వారికి ఆనందం అవధులు లేకుండా పోయింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube