సర్కార్ కీలక నిర్ణయం, అక్కడ నేరుగా ఇంటికే మద్యం!  

Meghalaya government allows home delivery of liquor, Meghalaya government , home delivery of liquor, Corona Effect, Lockdown Rules, Minister James K Sangma - Telugu Corona Effect, Home Delivery Of Liquor, Lockdown Rules, Meghalaya Government, Meghalaya Government Allows Home Delivery Of Liquor, Minister James K Sangma

కరోనా విలయతాండవం తో ప్రభుత్వాలు కూడా కీలక నిర్ణయాలు తీసుకోక తప్పడం లేదు.ఈ మహమ్మారి నేపథ్యంలో లాక్ డౌన్ లు విధిస్తూ కట్టడి చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు సఫలం కావడం లేదు, దీనితో జనాలను కంట్రోల్ చేయడానికి కొన్ని కొన్ని ప్రభుత్వాలు వారి అవసరాలకు తగ్గట్లుగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.

 Meghalaya Government Liquor Home Delivery

లాక్ డౌన్ లు విధించినప్పటికీ జనాలు మాత్రం ఇళ్లకే పరిమితం కాలేక ఎదో రూపేణా బయటకు వచ్చేందుకు చూస్తున్నారు.ఈ క్రమంలో మేఘాలయ సర్కార్ మద్యం ను ఇంటికే సరఫరా చేసే విధంగా నిర్ణయం తీసుకుంది.

లాక్ డౌన్ సమయంలో మందు బాబులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.దీనితో మద్యం కోసం బారులు వద్ద క్యూలు కడుతూ కుప్పలు తెప్పలు గా నిలబడడం తో ప్రభుత్వాలు ఇలాంటి సదుపాయాలు చేసే పనిలో పడ్డాయి.

సర్కార్ కీలక నిర్ణయం, అక్కడ నేరుగా ఇంటికే మద్యం-General-Telugu-Telugu Tollywood Photo Image

ఈ క్రమంలోనే మేఘాలయ సర్కార్ ఇలాంటి కీలక నిర్ణయం తీసుకొని మద్యం ను నేరుగా ఇంటికే సరఫరా చేసే విధంగా చర్యలు చేపడుతుంది.ఈ నేపథ్యంలో మద్యం దుకాణాలకు లైసెన్సులు కూడా జారీ చేయడానికి అన్ని చర్యలు చేపట్టినట్లు తెలుస్తుంది.

ఇప్పటికే ఈ ప్రతిపాదనకు క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపింది అని ప్రభుత్వం ఈ మేరకు చర్యలు చేపడుతుంది అని ఆ రాష్ట్ర మంత్రి జేమ్స్ కె సంగ్మా తెలిపారు.అయితే సర్కార్ ఇలాంటి నిర్ణయం తీసుకుంది అంటే కొంత ఆలోచించాల్సిన విషయమే అని చెప్పాలి.

ఎలా బడితే అలా ఎన్ని బడితే అన్ని ఇలా ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు మద్యం ఆర్డర్ చేయడానికి వీలులేదు.మందుబాబు ల కోసం కొన్ని షరతులు కూడా విధిస్తూ మేఘాలయ సర్కార్ ఈ హోం డెలివరీ ని నిర్వహించనుంది.

ఇంతకీ ఆ షరతులు ఏంటంటే ఒక ఆర్డర్‌పై మూడు లీటర్ల మద్యం, నాలుగు లీటర్ల బీర్‌ కన్నా ఎక్కువ సరఫరా చేయడానికి వీలు లేదని తెలిపింది.

అంతేకాకుండా కొనుగోలు దారులు తమ వయసు 20 ఏండ్లకుపైగానే ఉందని తెలిపే పత్రాన్ని కూడా తప్పకుండా సమర్పించాల్సి ఉంటుంది.అలాఅని ఒకవేళ తప్పుడు పత్రాలు సమర్పిస్తే అంతే ఖచ్చితంగా కఠిన చర్యలుంటాయని హెచ్చరిస్తుంది కూడా.మరి అయితే ఇక సర్కార్ వారి బెల్ట్ షాపుల నుంచే నేరుగా ఇంటికే మద్యం వచ్చేస్తే ఇక మందుబాబులు ఊరకనే ఉంటారా మరి.

#Corona Effect #MinisterJames #Lockdown Rules #HomeDelivery

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Meghalaya Government Liquor Home Delivery Related Telugu News,Photos/Pics,Images..