సత్యదేవ్ కి జోడీగా తమన్నాతో పాటు నితిన్ హీరోయిన్ కూడా

యంగ్ టాలెంట్ యాక్టర్ సత్యదేవ్ హీరోగా తమన్నా హీరోయిన్ గా కన్నడ సినిమాలో లవ్ మాక్ టైల్ కి రీమేక్ గా తెరకెక్కుతున్న సినిమా గుర్తుందా శీతాకాలం.నాగశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది.

 Megha Akash Roped In For A Special Cameo, Tollywood, Telugu Cinema, Gurthunda Se-TeluguStop.com

ఉమా మహేశ్వర సినిమా తరువాత సత్యదేవ్ కెరియర్ ఒక్కసారిగా టర్న్ తీసుకుంది.కథాబలం ఉన్న సినిమాలు చేస్తూ వరుసగా అవకాశాలు సొంతం చేసుకుంటున్నాడు.

అందులో భాగంగా స్టార్ హీరోయిన్ తమన్నాతో గుర్తుందా శీతాకాలం అంటూ సందడి చేయబోతున్నాడు.త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో తమన్నాతో పాటు మరో హీరోయిన్ కూడా కీలక పాత్రలో నటిస్తుంది.

నితిన్ తో లై, చల్ మోహన రంగా సినిమాలలో ఆడిపాడిన తమిళ బ్యూటీ మేఘా ఆకాష్ హీరోయిన్ గా కనిపించబోతుంది అని తెలుస్తుంది.

కథలో ఆమె పాత్ర నిడివి తక్కువే అయినా కీలక పాత్ర అని టాక్.తెలుగులో రెండు సినిమాలు చేసిన సక్సెస్ అందుకోలేకపోయిన మేఘా ఆకాష్ తన పాత్ర మీద నమ్మకంతో ఇందులో క్యామియో తరహా పాత్ర అయినా చేయడానికి ఒకే చెప్పింది.

ఇదిలా ఉంటే ఈ సినిమా ఆగిపోయిందని ఆ మధ్య ప్రచారం జరిగింది.అయితే దీనిలో వాస్తవం లేదని చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది.త్వరలో షూటింగ్ ప్రారంభం అవుతుందని స్పష్టం చేసింది.స్టార్ హీరోయిన్ తమన్నా, టాలెంటెడ్ హీరో సత్యదేవ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో దీనిమీద భారీగానే అంచనాలు ఉన్నాయి.

కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఈ సినిమా సత్యదేవ్ ఇమేజ్ కి ఎంత వరకు హెల్ప్ అవుతుంది అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube