సినిమా పరిశ్రమలో హీరోయిన్లతో పాటు ఎప్పుడూ ఉండేది తన తల్లి.షూటింగ్ సమయంలో ఎక్కువగా సెట్స్ లో హీరోయిన్ల తల్లులే కనిపిస్తుంటారు.
తమ బిడ్డతో ఎల్లప్పుడూ ఉంటూ.ఆమె బాగోగులు పట్టించుకుంటారు.
అంతేకాకుండా వారి షూటింగ్ షెడ్యూల్స్ కూడా వీల్లే చూసుకుంటారు.మరికొంత మంది హీరోయిన్లు తల్లులు ఏకంగా నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టి సినిమాలను కూడా తీస్తున్నారు.
ఇప్పటికే పలువురు హీరోయిన్ల తల్లులు నిర్మాతలుగా మారారు.తాజాగా మరో హీరోయిన్ తల్లి కూడా ఈ రంగంలోకి అడుగు పెడుతుంది.
ఇంతకీ ఆమె ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇప్పటికే బాలీవుడ్ టాప్ హీరోయిన్ Priyanka Chopra తల్లి నిర్మాతగా మారింది.పర్పుల్ పెబుల్ పిక్చర్స్ అనే సంస్థను స్థాపించింది.తన బిడ్డతో కలిసి కొన్ని సినిమాలను నిర్మించింది.
అటు కీర్తి సురేష్ తల్లి మేనక కూడా రేవతి కళామందిర్ అనే బ్యానర్ మీద పలు సినిమాలు నిర్మించింది.ప్రస్తుతం కీర్తి – టొవినో థామస్ నటీనటులుగా వాశి అనే మలయా మూవీని నిర్మిస్తుంది.
తాజాగా ఈ లిస్టులో చేరింది హీరోయిన్ మేఘా ఆకాష్ తల్లి బిందు ఆకాష్.
లై సినిమాతో తెలుగులోకి వచ్చింది అందాల తార మేఘా ఆకాష్.తన అందం, అభినయంతో జనాలను ఆకట్టుకుంది.‘రాజ రాజ చోర సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది.తాజాగా డియర్ మేఘ అనే సినిమా చేసింది.ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ.మను చరిత్ర, గుర్తుందా శీతాకాలం లాంటి సినిమాలు చేస్తుంది.తాజాగా తన తల్లి నిర్మిస్తున్న సినిమాలో హీరోయిన్ గా చేయబోతుంది.
ఓ లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కుతుంది.దర్శకుడు సుశాంత్ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.
వాలంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.
ఈ సినిమాలో నటించే ఇతర నటుల వివరాలను త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.మొత్తంగా తన తల్లి నిర్మాణంలో వస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో వేచి చూడాలి.