రాజ్ తరుణ్ కి జోడీగా మేఘా ఆకాష్.. ఆఫర్ ఇచ్చిన దిల్ రాజు

టాలీవుడ్ లో నితిన్ కి జోడీగా రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటించిన తమిళ ముద్దుగుమ్మ అదృష్టం కలిసి రాకపోవడంతో రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.దీంతో ఈ అమ్మడుని టాలీవుడ్ దర్శక, నిర్మాతలు పట్టించుకోవడం మానేశారు.

 Megha Akash Got Movie Chance In Dil Raju Production1-TeluguStop.com

ఇక ఈ భామకి తమిళంలో మాత్రం అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.యువ హీరోలతో జోడీ కడుతూ వరుస సినిమాలు చేస్తుంది.

ఇదిలా ఉంటే ఈ భామ చాలా గ్యాప్ తర్వాత మరల టాలీవుడ్ లో క్రేజీ ఆఫర్ ని సొంతం చేసుకుంది.అది కూడా దిల్ రాజు బ్యానర్ లో అవకాశం సొంతం చేసుకుంటుంది.

రాజ్ తరుణ్ హీరోగా దిల్ రాజు బ్యానర్ లో కృష్ణారెడ్డి దర్శకత్వంలో మూవీ తెరకెక్కబోతుంది.ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.

ప్రస్తుతం కెరియర్ లో వరుస ఫ్లాప్ లతో అవకాశాలు లేక ఖాళీగా ఉన్న రాజ్ తరుణ్ కి ఈ సినిమా చాలా కీలకం కానుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube