తెలుగులో నాలుగు సినిమాలు చేతిలో ఉంచుకున్న మేఘా ఆకాష్

తెలుగు మూలాలు ఉన్న హీరోయిన్ గా మేఘా ఆకాష్ టాలీవుడ్ లోకి నితిన్ లై మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.మొదటి సినిమాలో మంచి పెర్ఫార్మెన్స్ తో నటిగా ప్రూవ్ చేసుకున్న సినిమా సక్సెస్ కాకపోవడంతో పెద్దగా ఫేంలోకి రాలేదు.

 Megha Akash Four Telugu Movies Onroll-TeluguStop.com

తరువాత కూడా నితిన్ కి జోడీగా చల్ మోహన్ రంగా అనే సినిమాలో ఈ బ్యూటీ అవకాశం దక్కించుకున్న అది కూడా డిజాస్టర్ అయ్యింది.దీంతో టాలీవుడ్ లో ఛాన్స్ లు తగ్గడంతో కోలీవుడ్ లోకి అడుగుపెట్టి అక్కడ రజినీకాంత్ పెట్ట, బూమ్ రాంగ్, తో పాటు మరికొన్ని సినిమాలు చేసింది.

అక్కడ ఈ బ్యూటీకి సక్సెస్ వరించింది.అలాగే హిందీలోకి కూడా ఈ అమ్మడు ఎంట్రీ ఇచ్చింది.

 Megha Akash Four Telugu Movies Onroll-తెలుగులో నాలుగు సినిమాలు చేతిలో ఉంచుకున్న మేఘా ఆకాష్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రస్తుతం రిలీజ్ కి రెడీ అయిన సల్మాన్ ఖాన్ రాదే సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపిస్తుంది.ఇదిలా ఉంటే నటిగా మంచి మార్కులే వేయించుకొని గ్లామర్ గా కూడా పరవాలేదని అనిపించుకుంటున్న ఈ బ్యూటీ స్కిన్ షోకి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వదు.

అయితే ఇప్పుడు ఈమె కెరియర్ టాలీవుడ్ లో జెట్ స్పీడ్ తో దూసుకెళ్ళడానికి కావాల్సిన ఆఫర్స్ చేతిలో ఉన్నాయి.ప్రస్తుతం ఏకంగా నాలుగు సినిమాలు అమ్మడు చేతిలో పెట్టుకుంది.

అయితే అవన్నీ చిన్న సినిమాలే అయినా కూడా కాస్తా హైప్ ఉన్నవి కావడం విశేషం.శివ కందుకూరికి జోడీగా మనుచరిత్ర అనే మూవీ పట్టాలపై ఉంది.

అలాగే సత్యదేవ్, తమన్నా జోడీగా తెరకెక్కుతున్న గుర్తుందా శీతాకాలం మూవీలో సెకండ్ లీడ్ గా చేస్తుంది.అలాగే ఫిమేల్ సెంట్రిక్ కథతో తెరకెక్కుతున్న డియర్ మేఘా సినిమాలో టైటిల్ రోల్ పోషిస్తుంది.

శ్రీవిష్ణు హీరోగాగా హసత్ గోలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజరాజ చొర సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తుంది.చిన్న సినిమాలకి మేఘా ఆకాష్ ఇప్పుడు కేరాఫ్ అడ్రెస్ గా ఉంది.

కథ బాగుంటే కొత్తహీరోలతో కూడా చేయడానికి ఈ బ్యూటీ రెడీగా ఉండటంతో తెలుగులో అవకాశాలు పెరుగుతున్నాయి.మరి మొదటి రెండు సినిమాలు వర్క్ కాకున్నా ఇప్పుడు చేతిలో ఉన్న సినిమాలతో ఈ బ్యూటీకి సక్సెస్ వస్తే మాత్రం వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదనే మాట వినిపిస్తుంది.

#Dear Megha #Raja Raja Chora #Megha Akash

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు