త్రివిక్ర‌మ్ - మెగాస్టార్ సినిమా... స్టోరీ లైన్ కూడా లీక్ అయ్యిందే..!

మెగాస్టార్ చిరంజీవి – మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ సినిమా అంటే ఎలాంటి అంచ‌నాలు ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.మెగాస్టార్ క్లాస్‌, మాస్ క‌ల‌గ‌ల‌సిన హీరో, త్రివిక్ర‌మ్ ప‌క్కా ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ డైరెక్ట‌ర్‌.

 Megastar Trivikram Story Line Leaked,mega Star,chiranjeevi,acharya,ram Charan,tr-TeluguStop.com

వీరిద్ద‌రి కాంబినేష‌న్ అంటే ఆ సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించుకోవ‌డానికే అంద‌డం లేదు.అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ సినిమాతో ట్రాక్‌లోకి వ‌చ్చిన త్రివిక్ర‌మ్ అల వైకుంఠ‌పురంలో సినిమాతో ఎక్క‌డికో వెళ్లిపోయాడు.

కేవ‌లం క‌థ‌, క‌థ‌నాలు ఉంటే స్టార్ డ‌మ్ లేకుండానే బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్లు కొట్టేస్తున్నాడు.అది త్రివిక్ర‌మ్ స్టైల్‌.

అలాంటి స్టార్‌డ‌మ్‌కు మెగాస్టార్ చిరంజీవి లాంటి తిరుగులేని హీరో క్రేజ్ జోడైతే ఆ కాంబినేష‌న్ దెబ్బ‌కు బాక్సాఫీస్ మోత మోగిపోవాల్సిందే.ఇక ఎప్ప‌టి నుంచో త్రివిక్ర‌మ్ – చిరు సినిమా గురించి చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి.

జై చిరంజీవ సినిమాకు త్రివిక్ర‌మ్ ప‌నిచేశారు.ఇక ఎట్ట‌కేల‌కు ఈ క్రేజీ కాంబినేష‌న్లో సినిమా వ‌చ్చేందుకు రంగం సిద్ధ‌మైంది.

త్రివిక్ర‌మ్ చెప్పిన లైన్ చిరుకు న‌చ్చ‌డంతో ఇప్పుడు ఈ క‌థ మీదే త్రివిక్ర‌మ్ సీరియ‌స్‌గా వ‌ర్క్ చేస్తున్నాడ‌ట‌.ఆర్ ఆర్ ఆర్ కంప్లీట్ అయ్యి ఎన్టీఆర్ ఫ్రీ అయ్యేంత వ‌ర‌కు కూడా త్రివిక్ర‌మ్ ఈ సినిమాపైనే ప‌ని చేయ‌నున్నాడు.

Telugu Acharya, Chiranjeevi, Koratala Siva, Leaked, Ram Charan, Story, Trivikram

వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్లో లేదా, చిరు త‌న‌యుడు రామ్‌చ‌ర‌ణ్ బ్యాన‌ర్లో ఈ సినిమా తెర‌కెక్కే అవ‌కాశం ఉంది.మెయిన్ లైన్ వ‌చ్చి దొంగ స్వామిజీల మోసాలు, వాటిని ఎదుర్కొనే నేప‌థ్యంలో ఉంటుంద‌ని చెపుతున్నారు.వాస్త‌వానికి త్రివిక్రమ్ ఎన్టీఆర్‌తో సినిమా త‌ర్వాత‌ మహేష్ బాబుతో సినిమాని ప్లాన్ చేసుకున్నాడు.ఇప్పుడు చిరంజీవి సినిమా ఛాన్స్ రావ‌డంతో పాటు చిరు వ‌రుస‌గా సినిమాలు చేస్తుండ‌డం.

చిరు కూడా కొర‌టాల ఆచార్య త‌ర్వాత త్రివిక్ర‌మ్‌తో చేసేందుకు ఆస‌క్తిగా ఉండ‌డంతో ఈ కాంబినేష‌న్ ఫిక్స్ అయ్యిందంటున్నారు.

ఏదేమైనా ఆర్ ఆర్ ఆర్ కంప్లీట్ అయ్యి.

ఎన్టీఆర్ ఫ్రీ అయ్యాక ఎన్టీఆర్ సినిమా ఫినిష్ చేశాక కాని.చిరు – త్రివిక్ర‌మ్ సినిమా పట్టాలెక్క‌దు.

అంటే మ‌రో రెండేళ్ల వ‌ర‌కు కాని ఈ సినిమా వ‌చ్చే అవ‌కాశాలు లేవు.ఏదేమైనా మెగా – త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ అంటే కనుల‌విందే అని చెప్పాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube