భానుప్రియ గురించి మెగాస్టార్ అలాంటి కామెంట్లు చేశారా?

వంశీ దర్శకత్వంలో సితార సినిమా ద్వారా వెండితెర అరంగ్రేటం చేసిన అలనాటి నటీమణి భానుప్రియ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అద్భుతమైన కళ్ళు, నటన, డాన్స్ ద్వారా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు పొందిన భానుప్రియ ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సంపాదించుకున్నారు.

 Megastar Such Comments About Bhanupriya-TeluguStop.com

ఇండస్ట్రీలోకి భానుప్రియ అడుగు పెట్టే సమయంలో విజయశాంతి, రాధ, సుహాసిని వంటి నాయకులు ఫుల్ ఫామ్ లో ఉన్న సమయంలో భానుప్రియ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యింది.అయితే అప్పటికే స్టార్ హీరోయిన్స్ గా ఉన్న వారితో పాటు నిలవాలంటే భానుప్రియకు ఎక్కువ సమయం పడుతుందని భావించినప్పటికీ ఆమె అద్భుతమైన డాన్స్ తో వారికి పోటీగా నిలబడి ఇండస్ట్రీలోకి వచ్చిన కొద్ది రోజులకే గొప్ప హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది.

సినిమా ఇండస్ట్రీలో ఈ విధమైనటువంటి పోటీ ఉన్నప్పటికీ ఆమె నిలదొక్కుకోవడానికి కారణం ఆమె నేర్చుకున్న క్లాసికల్ డాన్స్ అని చెప్పవచ్చు.ఇలా ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న భానుప్రియ గురించి తాజాగా పరుచూరి గోపాలకృష్ణ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

 Megastar Such Comments About Bhanupriya-భానుప్రియ గురించి మెగాస్టార్ అలాంటి కామెంట్లు చేశారా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఒకప్పుడు వెండితెరపై శ్రీదేవి జయసుధ వంటి తారల హవా కొనసాగిన ఆ తర్వాత విజయశాంతి భానుప్రియ సుహాసిని వంటి వారు స్టార్ హీరోయిన్ గా కొనసాగారు.నేను ఎప్పుడు భానుప్రియను నాట్యమయూరి అని పిలుస్తుంటాను.

ఒకానొక సందర్భంలో మెగాస్టార్ చిరంజీవితో పాటు కేవలం రాధా తప్ప మరెవరూ డాన్స్ చేయలేరని అన్నారు.అయితే ఈ విషయంలో నా అభిప్రాయం చాలా వేరు
.

భానుప్రియ డాన్స్ చూసిన మెగాస్టార్ చిరంజీవి గారు ఆమె గురించి ఒకసారి తనతో ఆశక్తికరమైన వ్యాఖ్యలు చేశారని ఈ సందర్భంగా తెలియజేశారు.భానుప్రియ గారితో డాన్స్ చేసేటప్పుడు చాలాజాగ్రత్తగా ఉండాలని స్వయంగా చిరంజీవి గారు ఆమె డాన్స్ పై ప్రశంసలు కురిపించారని ఈ సందర్భంగా పరుచూరి గోపాలకృష్ణ తెలియజేశారు.ఆమె శరీరంలో అణువణువు డాన్స్ ఉందని అందుకే ఆమెను నాట్యమయూరి అని పిలుస్తుంటాం అని ఈ సందర్భంగా పరుచూరి గోపాలకృష్ణ తెలియజేశారు.

#Sitara #ParuchuriGoplaa #Chiranjeevi #Bhanu Priya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు