మెగాస్టార్ చిన్నల్లుడుని సోషల్ మీడియాలో టార్గెట్ చేసిన పోకిరీలు  

సోషల్ మీడియా మెగాస్టార్ అల్లుడుకి వేధింపులు. పోలీసులకి ఫిర్యాదు. .

Megastar Son In Law Complaint On Trolls In Social Media-

మెగాస్టార్ చిన్నల్లుడు గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన హీరో కళ్యాణ్ దేవ్.చిరంజీవి చిన్న కూతురు శ్రీజని ప్రేమించి రెండో పెళ్లి చేసుకున్న కళ్యాణ్ దేవ్ ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నాడు.ఇప్పటికే విజేత సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ దేవ్ ప్రస్తుతం పులి వాసు దర్శకత్వంలో ఓ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు..

Megastar Son In Law Complaint On Trolls In Social Media--Megastar Son In Law Complaint On Trolls Social Media-

త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతోంది.ఇదిలా ఉంటే తాజాగా కళ్యాణ్ దేవ్ శ్రీజ లను టార్గెట్ గా చేసుకుని కొంతమంది ఇంస్టాగ్రామ్ లో అసభ్యకర సందేశాలు పోస్ట్ చేస్తూ వేధించడం మొదలెట్టారు.వారి వేధింపులు రోజురోజుకి ఎక్కువవడంతో కళ్యాణ్ దేవ్ తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

గత కొద్దిరోజులుగా ఇంస్టాగ్రామ్ లో పది మంది కుర్రాళ్ళు తనను టార్గెట్ గా చేసుకుని అసభ్యకర సందేశాలు పంపిస్తున్నారని ఈ ఫిర్యాదులో పేర్కొన్నాడు.ఇక పోలీసులు కూడా కళ్యాణ్ దేవ్ కంప్లైంట్ ను సీరియస్ గా తీసుకుని వారిని వేధిస్తున్న వాళ్ల వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.అయితే ఇది ఇది శ్రీజ ని పెళ్లి చేసుకున్నందుకు లక్ష్యంగా చేసుకుని కళ్యాణ్ దేవ్ మీద ఇలా సోషల్ మీడియాలో అసభ్యకర మెసేజ్ లతో వేధింపులకు గురిచేస్తున్నారని తెలుస్తుంది.