సుకుమార్ దర్శకత్వంలో లూసిఫర్ రీమేక్ చేస్తున్న మెగాస్టార్  

Megastar Plan To Remake Malayali Hit Movie-malayali Hit Movie,megastar Plan To Remake,ram Charan,sukumar,tollywood

సెకండ్ ఇన్నింగ్ లో వరుస్ హిట్స్ తో ఊపు మీద ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా షూటింగ్ మొదలెట్టాడు.ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది.ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చేయబోయే సినిమాపై అప్పుడే చర్చలు మొదలయ్యాయి.టాలీవుడ్ లో దీనిపై ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి.మలయాళంలో మోహన్ లాల్ కథానాయకుడిగా పృథ్వీరాజ్ సుకుమారన్ తెరకెక్కించిన లూసిఫర్ సినిమా భారీ విజయం దక్కించుకుంది.వివేక్ ఒబెరాయ్ ఇందులో ప్రతినాయకుడుగా చేశాడు.పొలిటికల్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కింది.

Megastar Plan To Remake Malayali Hit Movie-Malayali Movie Megastar Ram Charan Sukumar Tollywood

ఇక ఈ సినిమాని రీమేక్ చేయాలని చిరంజీవి ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నారు.

ఇప్పుడు దానికి రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తుంది.స్టార్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో లూసిఫర్ సినిమాని రీమేక్ చేయాలని రామ్ చరణ్, మెగాస్టార్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది.

ప్రస్తుతం సుకుమార్ బన్నీతో ఓ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా నల్లమల ఫారెస్ట్ నేపధ్యంలో నడిచే కథ అని తెలుస్తుంది.

ఇందులో బన్నీ లారీ డ్రైవర్ గా కనిపించబోతున్నాడు.ఈ సినిమా పూర్తయ్యేనాటికి కొరటాల శివ సినిమాని చిరంజీవి పూర్తి చేస్తాడు.

తరువాత వీరిద్దరి కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది.

తాజా వార్తలు

Megastar Plan To Remake Malayali Hit Movie-malayali Hit Movie,megastar Plan To Remake,ram Charan,sukumar,tollywood Related....