మళ్లీ అన్నీ లీక్ చేసిన మెగాస్టార్.. గాడ్ ఫాదర్ లో పాత్రల గుట్టంతా రట్టు!

టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి గురించి తెలియని వారంటూ ఉండరు.పునాదిరాళ్లు సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన చిరంజీవి తన ప్రతిభతో అతి తక్కువ కాలంలోనే హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.

 Megastar Leaked Everything About All The Characters Of Godfather Details, Chiranjeevi, Tollywood, Godfather Movie, Telugu Film Industry, Telugu Indian Idol, Nayantharan, Satyadev, Chiru God Father Movie-TeluguStop.com

చిరంజీవి నటించిన ఎన్నో సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచాయి.ఈయన నటించిన ఇంద్ర వంటి సినిమాలు ఇప్పటికీ ప్రేక్షకుల ఫేవరెట్ సినిమాగా చెప్పుకోవచ్చు.

రాజకీయాల వల్ల కొంతకాలం సినిమాలకి దూరంగా ఉన్న చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమా ద్వారా ఇండస్ట్రీకి మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చాడు.ఈ సినిమా హిట్ అవటంతో వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు.

 Megastar Leaked Everything About All The Characters Of Godfather Details, Chiranjeevi, Tollywood, Godfather Movie, Telugu Film Industry, Telugu Indian Idol, Nayantharan, Satyadev, Chiru God Father Movie-మళ్లీ అన్నీ లీక్ చేసిన మెగాస్టార్.. గాడ్ ఫాదర్ లో పాత్రల గుట్టంతా రట్టు-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

చిరంజీవి వయసు పెరిగే కొద్దీ చాలా హ్యాండ్సమ్ గా తయారయ్యి వరుస సినిమాలలో నటిస్తూ కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు.చిరంజీవి ఇండస్ట్రీకి మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయన తన కుమారుడు రామ్ చరణ్ తో కలిసి నటించిన ఆచార్య సినిమా ఇటీవల విడుదలైంది.

కానీ ఇటీవల విడుదలైన ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.ఆచార్య డిజాస్టర్ తర్వాత మెగాస్టార్ “గాడ్ ఫాదర్ సినిమాలో నటించనున్నారు.ఓటీటీలో ప్రసారమవుతున్న తెలుగు ఇండియన్ ఐడల్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లో చిరంజీవి గెస్ట్ గా హాజరయ్యారు.

ఓటీటీలో ప్రసారమవుతున్న ఈ సింగింగ్ షో ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది.

Telugu Chiranjeevi, Chiru God, Godfather, Nayantharan, Satyadev, Telugu, Tollywood-Latest News - Telugu

ఈ సందర్భంగా చిరంజీవి గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లో పాల్గొని విన్నర్ ని అన్నౌన్స్ చేశారు.ఈ షోలో పాల్గొన్న చిరంజీవి “గాడ్ ఫాదర్ ” సినిమా విశేషాలను బయటపెట్టాడు.మలయాళం బ్లాక్ బస్టర్ లూసిఫర్ రీమేక్ గా రూపొందుతున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్ ని తెలుగులో “గాడ్ ఫాదర్” గా రీమేక్ చేస్తున్నారు.ఈ సినిమాలో ప్రముఖ హీరోయిన్ నయనతార కూడా నటించనుంది.

ఈ సినిమాలో చిరంజీవి, నయనతార అన్నా చెల్లెలుగా నటిస్తున్నారని చిరంజీవి లీక్ చేశారు.ఇక సత్యదేవ్ నయనతార భర్తగా నెగటివ్ పాత్రలో కనిపిస్తారు… అంటూ అసలు విషయాలు లీక్ చేశారు.

ఈ విధంగా చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలో నటీనటుల పాత్రల గురించి లీక్ చేయడంతో ఈ వార్తలు కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube