కెమెరామెన్ కు ఆర్థికసాయం చేసిన మెగాస్టార్...మంచి మనసు చాటుకున్న చిరు!

మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని అంచలంచెలుగా ఇండస్ట్రీలో ఎదుగుతూ నేడు మెగాస్టార్ బిరుదుతో వెలుగొందుతున్నారు.ఇలా ఇండస్ట్రీలో సీనియర్ హీరోగా మంచి గుర్తింపు పొందడమే కాకుండా,సినిమా ఇండస్ట్రీని తన కుటుంబంగా భావించిన చిరంజీవి ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు కానీ కార్మికులు కానీ ఆపదలో ఉన్నారు అంటే ఏమాత్రం ఆలోచించకుండా వారికి తనదైన శైలిలో సహాయం చేస్తూ తన గొప్ప మనసును చాటుకుంటున్నారు.

 Megastar Financed The Cameraman Chiru Showed A Good Heart , Chiranjeevi,  Tollyw-TeluguStop.com

Telugu Cameraman, Chiranjeevi, Devaraj, Financial, Nagu, Puli Bebbuli, Tollywood

ఇప్పటికే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎంతోమందికి ప్రాణదానం చేశారు.కరోనా సమయంలో ఎంతోమంది కార్మికులకు అండగా నిలిచారు.అలాగే ఆక్సిజన్ సిలిండర్లను అందుబాటులోకి తీసుకువచ్చి ఎంతోమంది ప్రాణాలను నిలబెట్టారు.ఇలా చెప్పుకుంటూ పోతే చిరంజీవి చేసిన సహాయ సహకారాలు ఎన్నో ఉన్నాయి.ఇకపోతే తాజాగా సీనియర్ కెమెరామెన్ దేవరాజ్ ఎన్నో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు.ఈయన చిరంజీవి నటించిన నాగు, పులి, బెబ్బులి, రాణి కాసుల రంగమ్మ వంటి సినిమాలకు కెమెరామెన్ గా వ్యవహరించారు.

Telugu Cameraman, Chiranjeevi, Devaraj, Financial, Nagu, Puli Bebbuli, Tollywood

సుమారు 30 సంవత్సరాల క్రితం చిరంజీవి సినిమాలకు కెమెరామెన్ గా పనిచేసిన దేవరాజ్ ప్రస్తుతం వయసు పై పడటంతో ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.అయితే ఈయన ఆర్థిక ఇబ్బందులను ఈయన పరిస్థితిలను తెలుసుకున్నటువంటి మెగాస్టార్ చిరంజీవి ఈయనకు ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేశారు.ఇలా 30 సంవత్సరాల క్రితం తన సినిమాలకు పనిచేసిన ఒక వ్యక్తి ఆపదలో ఉన్నారని తెలిసి చిరంజీవి ఆయనకు అండగా నిలవడంతో అభిమానులు చిరంజీవి మంచి మనసు పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube