మెగా 152 కు క్లాప్ పడింది  

Megastar Chiru 152 Is Started - Telugu Chiranjeevi, Chiru 152, Konidela Film Prpductions, Koratala Siva, Ram Charan, Tamanna

గత సంవత్సర కాలంగా చిరంజీవి 152 వ సినిమా గురించిన వార్తలు వస్తున్నాయి.కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందబోతుందని ఎప్పుడో వార్తలు వచ్చాయి.

Megastar Chiru 152 Is Started

రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మించబోతున్నాడు.సైరా సినిమా షూటింగ్ పూర్తి కాకముందే అంటే ఈ ఏడాది ఆరంభంలోనే సినిమాను ప్రారంభించాలని భావించారు.

కానీ సైరా కోసం చిరు చాలా కష్టపడుతున్నాడు.మళ్ళీ వేరే సినిమా మొదలు పెట్టి ఆయన్ను ఇంకా కష్టపెట్టడం వద్దని చరణ్ ఆపుతూ వస్తున్నాడు.

మెగా 152 కు క్లాప్ పడింది-Movie-Telugu Tollywood Photo Image

ఇటీవలే సైరా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఆ సినిమా భారీ విజయాన్ని దక్కించుకుంది.ఆ ఉత్సాహంతో చిరు తన తర్వాత సినిమాను మొదలు పెట్టాడు.నిన్న దసరా సందర్భముగా చిరు 152వ సినిమాను మొదలు పెట్టారు.

పండుగ సందర్భంగా సినిమాను మొదలు పెట్టారు.వచ్చే నెలలో సినిమాను సెట్స్ పైకి తీసుకు వెళ్లబోతున్నారు.

ఈ సినిమాలో చిరుకు జోడిగా త్రిషను ఎంపిక చేసే అవకాశం కనిపిస్తోంది.త్రిష లేదంటే కాజల్ మరియు బాలీవుడ్ హీరోయిన్ ను పరిశీలిస్తున్నారు.హీరోయిన్ విషయంలో అతి త్వరలోనే క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.ఈ సినిమాను కొరటాల శివ సాన్నిహితుడు చరణ్ తో కలిసి నిర్మిస్తున్నాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు