మెగాస్టార్‌ కూడా రంగమ్మత్తపై ఆసక్తి చూపిస్తున్నట్లున్నాడుగా..  

Megastar Chiru Want Anasuya In His Movie-anchor Anasuya,megastar Chiru,megastar Chiru 152th Movie,ram Charan

రామ్‌ చరణ్‌ కెరీర్‌ బిగ్గెస్ట్‌ సక్సెస్‌ మూవీ ‘రంగస్థలం’. ఈ చిత్రం చరణ్‌ కెరీర్‌లోనే కాకుండా అనసూయ కెరీర్‌లో కూడా నిలిచి పోయే సినిమా అయ్యింది. అప్పటి వరకు జబర్దస్త్‌ అనసూయ అంటూ పిలుచుకున్న జనాలు ఇప్పుడు రంగమ్మత్త అనసూయ అంటూ పిలుచుకుంటున్నారు. అంతటి గుర్తింపు దక్కించిన మెగా మూవీ అనసూయకు చాలా ప్రత్యేకం అని చెప్పాలి..

మెగాస్టార్‌ కూడా రంగమ్మత్తపై ఆసక్తి చూపిస్తున్నట్లున్నాడుగా..-Megastar Chiru Want Anasuya In His Movie

చరణ్‌ తో మూవీ తర్వాత ఇప్పుడు చిరంజీవితో మూవీకి ఈ అమ్మడికి అవకాశం దక్కినట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం చిరంజీవి 152వ చిత్రంలో అనసూయ కీలక పాత్రలో నటించబోతుంది. చిరు 152వ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించబోతున్నాడు. రామ్‌ చరణ్‌ మరియు మిక్కిలినేని సుధాకర్‌లు కలిసి సంయుక్తంగా మెగా 152 మూవీని నిర్మించబోతున్నారు. సైరా కారణంగా సినిమాను వాయిదా వేస్తూ వస్తున్నారు. ఎట్టకేలకు సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ పూర్తి చేసి, షూటింగ్‌కు సిద్దం అయ్యారు.

మరో నెల రోజుల్లో సినిమాను పట్టాలెక్కించబోతున్నట్లుగా కొరటాల శివ సన్నిహితుల వద్ద చెప్పుకొచ్చాడు. ఈ చిత్రంలో హీరోయిన్‌ ఎవరు అనే విషయంపై క్లారిటీ అయితే రాలేదు కాని ప్రముఖంగా ముగ్గురు నలుగురు పేర్లు వినిపిస్తున్నాయి. ఈ సమయంలోనే అనసూయ కీలక పాత్ర కోసం ఎంపిక అయినట్లుగా తెలుస్తోంది. జబర్దస్త్‌ యాంకర్‌గా వ్యవహరిస్తూనే హీరోయిన్‌గా, నటిగా కూడా ఈ అమ్మడు దూసుకు పోతుంది.

మెగాస్టార్‌ మూవీతో అనసూయ కెరీర్‌ మరింత బ్రైట్‌గా మారే అవకాశం ఉంది.