మెగాస్టార్ చిరంజీవి రెట్టించిన ఉత్సాహంతో ఉన్నారు. ఆచార్య వంటి ప్లాప్ తర్వాత మెగాస్టార్ గాడ్ ఫాదర్ సినిమాతో హిట్ అందుకున్నాడు.
ఈ సినిమా దసరాకు రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అందుకుంది.ఇక ఇప్పుడు మరో సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు.
బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వాల్తేరు వీరయ్య సినిమా అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ భారీగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.2023 జనవరి 13న ఈ సినిమా రిలీజ్ అవ్వబోతుంది.మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో పాటు మాస్ రాజా రవితేజ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు.
చాలా రోజుల తర్వాత చిరంజీవి ఈ సినిమాలో వింటేజ్ లుక్ తో ఆకట్టు కోవడానికి రెడీ అవుతున్నాడు.ఈ మధ్య కాలంలో ఎప్పుడు లేనంతగా మెగాస్టార్ లుక్ పూర్తిగా మార్చేసి మాస్ లుక్ లోకి మారిపోయాడు.ఇప్పటికే వచ్చిన ప్రొమోషనల్ కంటెంట్ తో ఈ సినిమా నెక్స్ట్ లెవల్ కు వెళ్ళిపోయింది.
మరి మరో 15 రోజుల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రొమోషన్స్ ను మేకర్స్ స్టార్ట్ చేసారు.ఈ క్రమంలోనే నిన్న మేకర్స్ మొత్తం కలిసి ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసారు.
ఈ ప్రెస్ మీట్ లో మెగాస్టార్ ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.ఈ సినిమాపై మెగాస్టార్ తన రివ్యూ ను చెప్పేసాడు.దీంతో ఈయన చెప్పిన రివ్యూ నెట్టింట వైరల్ అయ్యింది.వాల్తేరు వీరయ్య రొటీన్ యాక్షన్ ఎంటర్టైనరే కానీ ఈ సినిమాలో మాత్రం అదిరిపోయే ఎలిమెంట్ ఉంది అని దీనికి అద్భుతమైన వివరణ ఇచ్చారు.
అమ్మ ప్రతీ రోజు వంట చేస్తుంది అది రొటీన్ అయినా ఏదో స్పెషల్ ఉంటుంది.అలాంటిదే వాల్తేరు వీరయ్య అంటూ చిరు చెప్పిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.