Chiranjeevi Waltair Veerayya: వాల్తేరు వీరయ్య రిలీజ్ డేట్ ఫిక్స్.. అఫిషియల్ పోస్టర్ తో కన్ఫర్మ్!

మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే గాడ్ ఫాదర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆచార్య ప్లాప్ ను మరిపించే విధంగా హిట్ అందుకున్నాడు.దీంతో రెట్టించిన ఉత్సాహంతో మరో సినిమాను రిలీజ్ చేయడానికి రెడీ అయ్యాడు.

 Megastar Chiranjeevi Waltair Veerayya Gets A Release Date Details, Waltair Veera-TeluguStop.com

ప్రెజెంట్ చిరంజీవి చేస్తున్న సినిమాల్లో వాల్తేరు వీరయ్య ఒకటి.బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూట్ దాదాపు పూర్తి అయ్యింది.

ప్రెజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.ఈ సినిమాలో చిరు మాత్రమే కాదు మాస్ రాజా రవితేజ కూడా కీలక రోల్ ప్లే చేస్తున్నాడు.

రవితేజ, మెగాస్టార్ కలిసి నటిస్తుండడంతో ఇది మల్టీ స్టారర్ మూవీగా ప్రేక్షకులు భావిస్తున్నారు.

చాలా రోజుల తర్వాత చిరు, రవితేజ కాంబోలో సినిమా రాబోతుండడంతో మరింత ఆసక్తిగా మెగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.2023 సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ఇప్పటికే అఫిషియల్ గా ప్రకటించారు.అయితే డేట్ మాత్రం ఇప్పటి వరకు ప్రకటించలేదు.

ఈ సినిమా సంక్రాంతి మూడు రోజుల్లో ఎప్పుడు రాబోతుందో అని అంతా ఎదురు చూస్తున్నారు.అయితే ఎట్టకేలకు ఈ సినిమా సంక్రాంతికి ఎప్పుడు రిలీజ్ అవుతుందో డేట్ ఫిక్స్ చేసుకున్నారు.

Telugu Bobby, Chiranjeevi, Ravi Teja, Shruti Haasan-Movie

వాల్తేరు వీరయ్య సంక్రాంతి మూడు రోజుల్లో 13న రాబోతుంది అని అఫిషియల్ గా పోస్టర్ ద్వారా కన్ఫర్మ్ చేసేసారు.మాస్ ప్రేక్షకులకు పూనకాలు తెచ్చే విధంగా ఈ పోస్టర్ ఉంది.చిరు వింటేజ్ లుక్ తో మాస్ అవతారంలో లుంగీ కట్టి హెడ్ బ్యాండ్ తో వైబ్రెంట్ షర్ట్ తో అదిరిపోయాడు.ఈ పోస్టర్ కూడా మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

మరి సినిమా మొత్తం మెగాస్టార్ ఎలా ఉంటాడో వేచి చూడాల్సిందే.ఇక ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ భారీగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube