మెగాస్టార్ చిరంజీవి ( Megastar Chiranjeevi ) ఒకేసారి రెండు సినిమాలను ప్రకటించిన విషయం తెలిసిందే.ఆ రెండు సినిమాలపై ఇప్పటికే అంచనాలు భారీ స్థాయిలో పెరిగాయి.
మరి మెగాస్టార్ ప్రకటించిన సినిమాల్లో మెగా 156 ఒకటి.ఈ సినిమా ఇటీవలే విజయదశమి రోజు ఘనంగా లాంచ్ అయ్యింది.
ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ వారు భారీ స్థాయిలో నిర్మిస్తుండగా ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.ఇక ఈ సినిమాను బింబిసార డైరెక్టర్ వసిష్ఠ మల్లిడి ( Director Mallidi Vassishta ) తెరకెక్కిస్తున్న విషయం విదితమే.బింబిసార వంటి హిట్ తర్వాత వసిష్ఠ మెగాస్టార్ తో సినిమా చేస్తుండడంతో సాధారణ ఆడియెన్స్ కూడా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.
పంచభూతాల కాన్సెప్ట్ తో తెరకెక్కనున్న ఈ సినిమా నవంబర్ నుండి రెగ్యురల్ షూట్ స్టార్ట్ కానుంది.అయితే తాజాగా ఈ సినిమా నుండి క్రేజీ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది.ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉండగా ఇద్దరినీ ఫైనల్ చేసినట్టు టాక్ నడుస్తుంది.
ఎప్పటి నుండో ఈ సినిమాలో అనుష్క శెట్టి (Anushka Shetty ) హీరోయిన్ అనే కామెంట్స్ వస్తూనే ఉన్నాయి.ఇక ఈ భామతో పాటు ఇప్పుడు కాజల్ అగర్వాల్ ( Kajal Aggarwal ) ను కూడా ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది.
ఇలా ఇద్దరు సీనియర్ అండ్ స్టార్ హీరోయిన్లను మెగాస్టార్ కోసం ఫిక్స్ చేయడంతో ఫ్యాన్స్ లో ఎగ్జైట్మెంట్ పెరిగింది.ఈ ఇద్దరు ఆల్మోస్ట్ ఫైనల్ అని అఫిషియల్ అప్డేట్ అతి త్వరలోనే రానుందని అంటున్నారు.
ఇక భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను 2025 సంక్రాంతి టార్గెట్ గా ఆడియెన్స్ ముందుకు రానుంది.