శ్యామ్ సింగరాయ్ తో కలిసి మీసం మెలేసిన మెగాస్టార్.. పిక్ వైరల్!

న్యాచులర్ స్టార్ నాని శ్యామ్ సింగరాయ్ సినిమాతో ప్రేక్షకులకు ఒక కొత్త కాన్సెప్ట్ ఉన్న సినిమాను చూపించాడు.నాని శ్యామ్ సింగరాయ్ సినిమా ఇటీవలే రిలీజ్ అయిన విషయం తెలిసిందే.

 Megastar Chiranjeevi With Shyam Singha Roy Nani Details,shyam Singha Roy, Nani,-TeluguStop.com

క్రిస్మస్ కానుకగా గత ఏడాది డిసెంబర్ 24 న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేసారు మేకర్స్.విడుదల అయిన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ రావడమే కాకుండా మంచి వసూళ్లు కూడా రాబట్టింది.

రాహుల్ సంక్రిత్యాన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను నిహారిక ఎంటర్టైన్మెంట్ పతాకంపై వెంకట్ బోయినపల్లి నిర్మించగా మిక్కీ జె మేయర్ సంగీతం అందించాడు.ఈ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ లు హీరోయిన్స్ గా నటించారు.

కోల్‌కతా నేపథ్యంలో సాగే టైమ్ ట్రావెలింగ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాలో పవర్ ఫుల్ పాత్రలో నటించిన నాని నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారనే చెప్పాలి.

ఈ సినిమాలో నాని నటనకు సినీ ప్రముఖులు సైతం ప్రశంసిస్తూ ఆయనను అభినందించిన విషయం తెలిసిందే.

ఈ లిస్టులో తాజాగా మరొక స్టార్ చేరిపోయాడు.

మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాను వీక్షించినట్టు తెలుస్తుంది.ఆ విషయాన్నీ హీరో నాని ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ చిరంజీవితో కలిసి దిగిన ఒక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసారు.

ఆ ఫొటోకు శ్యామ్ సింగ రాయ్ ఎవరిని ప్రేమించాడు చెప్పుకోండి అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చాడు.ఇక నాని షేర్ చేసిన ఫొటోలో శ్యామ్ సింగ రాయ్ సినిమాలో నాని మీసం తిప్పినట్టు ఈ ఫొటోలో కూడా నాని, మెగాస్టార్ కలిసి మీసం మెలేస్తూ కనిపించారు.ఈ ఫోటో నాని షేర్ చేసిన కొద్దీ సేపట్లోనే వైరల్ గా మారింది.

ఇప్పటికే ఈ సినిమాను రామ్ చరణ్ కూడా వీక్షించి నాని నటనను మెచ్చుకున్న విషయం తెలిసిందే.ఇక ఇప్పుడు మెగాస్టార్ కూడా శ్యామ్ సింగ రాయ్ ను వీక్షించాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube