కృష్ణవంశీ రంగమార్తాండలో మెగాస్టార్ చిరంజీవి..!

ఒకప్పుడు టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ డైరక్టర్ గా సెన్సేషనల్ హిట్లు అందుకున్న కృష్ణవంశీ ఇప్పుడు కెరియర్ పరంగా పూర్తిగా వెనకపడ్డారు.నక్షత్రం తర్వా అడ్రెస్ లేకుండాపోయిన కృష్ణవంశీ మరాఠి సినిమా నట సామ్రాట్ సినిమాను రీమేక్ చేస్తున్నారు.

 Megastar Chiranjeevi Voice Over For Krishna Vamsy Rangamarthanda-TeluguStop.com

రంగమార్తాండ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, శివాత్మిక వంటి స్టార్స్ నటిస్తున్నారు.సెట్స్ మీద ఉన్న ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది.

సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవి హెల్ప్ తీసుకుంటున్నాడు కృష్ణవంశీ.

 Megastar Chiranjeevi Voice Over For Krishna Vamsy Rangamarthanda-కృష్ణవంశీ రంగమార్తాండలో మెగాస్టార్ చిరంజీవి..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

రంగమార్తాండ సినిమాకు మెగాస్టార్ సపోర్ట్ ఉంటుందని తెలుస్తుంది.సినిమాకు చిరు వాయిస్ ఓవర్ ఇస్తున్నారని టాక్.ఆ వాయిస్ ఓవర్ తోనే సినిమా మొదలవుతుందని తెలుస్తుంది.తప్పకుండా రంగమార్తాండ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ స్పెషల్ గా ఉంటుందని అంటున్నారు.త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ టీజర్ వస్తుందని అంటున్నారు.

కృష్ణవంశీ మరోసారి తన ప్రతిభ ఈ సినిమాతో చూపించాలని ఫిక్స్ అయ్యారు. మరి రంగమార్తాండ సినిమాకు మెగాస్టార్ వాయిస్ ఓవర్ ఏమేరకు హెల్ప్ అవుతుంది అన్నది చూడాలి.

ఈ సినిమాలో బిగ్ బాస్ ఫేమ్ రాహుల్ సిప్లిగంజ్, అలి రెజాలు కూడా నటిస్తున్నారు.

#Ramyakrishna #Prakash Raj #Chiranjeevi #Rangamarthanda #Krishna Vamsy

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube