ఆ అద్భుతాన్ని మాటల్లో వివరించలేనంటున్న చిరంజీవి..?

మెగాస్టార్ చిరంజీవి సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీకి తగినంత సమయం కేటాయించడంతో పాటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటారనే సంగతి తెలిసిందే.చిరంజీవి తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేయగా ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

 Chiranjeevi Tweets Sunrise Video At His House, Tweets, Sunrise Video, Social Med-TeluguStop.com

చిరంజీవి సూర్యోదయాన్ని వీడియో తీసి ఆ వీడియోను అభిమానులతో పంచుకోవడంతో పాటు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

చిరంజీవి తన ట్వీట్ లో సూర్యోదయం, సూర్యాస్తమయం యొక్క అందాన్ని, అద్భుతాన్ని మాటల్లో వివరించలేమని పేర్కొన్నారు.

ఎన్నో అందమైన దృశ్యాలు ప్రపంచంలో ఉన్నాయని ఆ అందమైన దృశ్యాలను ఎన్నిసార్లు చూసినా తనివి తీరదని చిరంజీవి అభిప్రాయపడ్డారు.శతాబ్దాలు పూర్తైనా సూర్యోదయం, సూర్యాస్తమయం గురించి మాటల్లో వివరించలేమని చిరంజీవి పేర్కొన్నారు.

ఉదయం సమయంలో చిరంజీవి ఇంటిపై నుంచి తీసిన ఈ వీడియోకు నెటిజన్ల నుంచి పాజిటివ్ కామెంట్లతో పాటు వేల సంఖ్యలో లైకులు వస్తున్నాయి.

మరోవైపు చిరంజీవి రీఎంట్రీలో వరుసగా సినిమాలను ప్లాన్ చేసుకుంటూ అభిమానులను అవాక్కయ్యేలా చేస్తున్నారు.ప్రస్తుతం చిరు నటిస్తున్న ఆచార్య సినిమా మే 13వ తేదీన విడుదల కానుండగా ఆ తరువాత చిరంజీవి లూసిఫర్, వేదాళం రీమేక్ లతో పాటు బాబీ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్నారు.కమర్షియల్ అంశాలు పుష్కలంగా ఉన్న కథలను చిరంజీవి ఎంపిక చేసుకుంటూ ఉండటం గమనార్హం.

రీఎంట్రీలో చిరంజీవి నటిస్తున్న సినిమాలు సక్సెస్ సాధించడంతో పాటు భారీ కలెక్షన్లను సొంతం చేసుకుంటున్నాయి.ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమా కూడా భారీ బడ్జెట్ మూవీనే కావడం గమనార్హం.

చిరుకు జోడీగా కాజల్ ఈ సినిమాలో నటిస్తుండగా చరణ్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తున్నారు.అపజయం ఎరుగని దర్శకుడు కొరటాల శివ ఆచార్య సినిమాతో చిరంజీవి, చరణ్ లకు కెరీర్ బెస్ట్ హిట్ ఇస్తాడేమో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube