వకీల్ సాబ్ పై చిరంజీవి రివ్యూ..! - Megastar Chiranjeevi Tweet About Vakeel Saab

Megastar Chiranjeevi Tweet about Vakeel saab, Megastar Chiranjeevi, Pawan Kalyan, Tweet, Vakeel Saab, tollywood - Telugu Megastar Chiranjeevi, Pawan Kalyan, Tweet, Vakeel Saab

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాపై మెగాస్టార్ రివ్యూ మెగా, పవర్ స్టార్ ఫ్యాన్స్ ను అలరిస్తుంది.సినిమా చూసేందుకు మీతో పాటు నేను కూడా ఆత్రుతగా ఉన్నానని చెప్పి మొన్న ట్వీట్ చేసిన చిరు నిన్న సినిమా చూసి కొద్దిసేపటి క్రితం సినిమా గురించి ట్వీట్ చేశారు.

 Megastar Chiranjeevi Tweet About Vakeel Saab-TeluguStop.com

మూడేళ్ల తర్వాత మళ్లీ పవన్ కళ్యాణ్ అదే వేడి అదే వాడి అదే పవర్ అంటూ సినిమాలో నటించిన నటీనటులు బాగా చేశారని. కోర్ట్ రూం డ్రామా అద్భుతం అని అన్నారు చిరు.

అంజలి, నివేదా థామస్, అనన్యా వారి పాత్రల్లో జీవించారు.మ్యూజిక్ థమన్, డైరక్టర్ వేణుతో పాటుగా నిర్మాతలు దిల్ రాజు, బోనీ కపూర్ లకు శుభాకాంక్షలు తెలిపారు.

 Megastar Chiranjeevi Tweet About Vakeel Saab-వకీల్ సాబ్ పై చిరంజీవి రివ్యూ..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మహిళలకు ఇవ్వాల్సిన గౌరవాన్ని తెలియచేసే అత్యవసరమైన చిత్రం అంటూ వకీల్ సాబ్ కేసులనే కాదు మనసులు గెలిచాడని చిరు రివ్యూ ఇచ్చారు.

చిరంజీవి వకీల్ సాబ్ రివ్యూ తో మెగా, పవర్ స్టార్ ఫ్యాన్స్ లో హుషారు రెట్టింపు అయ్యింది.

పవర్ స్టార్ మేనియాతో వచ్చిన ఈ సినిమా అన్నిచోట్ల సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.బాలీవుడ్ లో సూపర్ హిట్టైన పింక్ సినిమాను తెలుగులో పవర్ స్టార్ ఇమేజ్ కు తగినట్టుగా రీమేక్ చేశారు.

మూల కథను మార్చకుండా పవన్ కళ్యాణ్ కు పర్ఫెక్ట్ సూటయ్యేలా కథనం మార్చి సూపర్ హిట్ కొట్టాడు డైరక్టర్ వేణు శ్రీరాం.

#Vakeel Saab #Tweet #Pawan Kalyan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు