రాజమౌళి మాస్టర్ ప్లాన్.. ఆర్‌ఆర్‌ఆర్‌ లో చిరంజీవి..?  

టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత భారీ బడ్జెట్ తో రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.రియల్ క్యారెక్టర్స్ తో కూడిన ఫిక్షనల్ కథాంశంతో రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

TeluguStop.com - Megastar Chiranjeevi To Lend Voice For Rrr Movie

ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తున్నారు.

ఇప్పటికే ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి.

TeluguStop.com - రాజమౌళి మాస్టర్ ప్లాన్.. ఆర్‌ఆర్‌ఆర్‌ లో చిరంజీవి..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఈ సినిమా ఎప్పుడు విడుదలైనా కొత్త కలెక్షన్ల రికార్డులు సృష్టిస్తుందని చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.అయితే తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి కూడా ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో భాగం కానున్నారు.

చిరంజీవి ఈ సినిమాలో నటించకపోయినా ఆర్‌ఆర్‌ఆర్‌ తెలుగు వెర్షన్ లో ఎన్టీఆర్, చరణ్ క్యారెక్టర్లను పరిచయం చేయనున్నారని తెలుస్తోంది.

హిందీ వెర్షన్ లో బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ఎన్టీఆర్, చరణ్ పాత్రలను పరిచయం చేయనున్నారు.చిరంజీవి, అమీర్ ఖాన్ వాయిస్ ఓవర్ ఇవ్వడం వల్ల ఆర్‌ఆర్‌ఆర్ మూవీ రేంజ్ మరింత పెరగడం ఖాయమని చెప్పవచ్చు.ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా షూటింగ్ పూర్తైన తరువాత విడుదల తేదీని ప్రకటించాలని రాజమౌళి భావిస్తున్నారు.

ఆర్‌ఆర్‌ఆర్‌ లో చరణ్ కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ నటిస్తుండగా ఎన్టీఆర్ కు జోడీగా హాలీవుడ్ హీరోయిన్ ఒలీవియో మోరిస్ నటిస్తున్నారు.

శ్రియ, అజయ్ దేవగన్, సముద్రఖని, రాజీవ్ కనకాల ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన రెండు టీజర్లు విడుదల కాగా రెండు టీజర్లకు ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది.డీవీవీ దానయ్య ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

చరిత్ర నేపథ్యం ఉన్న సినిమానే అయినప్పటికీ కమర్షియల్ ఎలిమెంట్లు పుష్కలంగా ఉండేలా రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని సమాచారం.

#Alia Bhatt #MegaStar #Chiranjeevi #Rajeev Kanakala #@KChiruTweets

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Megastar Chiranjeevi To Lend Voice For Rrr Movie Related Telugu News,Photos/Pics,Images..