‘బిగ్‌బాస్‌’ జాబితాలో మెగాస్టార్‌ కూడా... గట్టిగా నవ్వుతున్న జనాలు     2019-01-06   10:04:05  IST  Ramesh Palla

‘బిగ్‌బాస్‌’ షోకు తెలుగులో మంచి పాపులారటి దక్కింది. ఈ షో మొదటి సీజన్‌కు జూ. ఎన్టీఆర్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. దాంతో షోకు మంచి రేటింగ్స్‌ లభించాయి. మొదటి సీజన్‌ కే మంచి స్పందన రావడంతో నిర్వహకులు సీజన్‌ 2ను ఏర్పాటు చేశారు ‘బిగ్‌ బాస్‌ 2’ కు నాచురల్‌ స్టార్‌ నాని ఇంకొంచెం మసాలా అంటూ తనదైన స్టయిల్‌లో యాంకరింగ్‌ చేశాడు. కానీ షోలో నాని వ్యవహరించిన తీరు వల్ల సోషల్‌ మీడియాలో ఓ రేంజ్‌లో విమర్శలు వెల్లువెత్తాయి. కాగా సీజన్‌ 3కి నాని హోస్టింగ్‌ చేసే ఛాన్స్‌ లేకుండా పోయింది.

Megastar Chiranjeevi To Host For The Bigg Boss Telugu Season 3-Megastar Megastar As Big In Viral About

Megastar Chiranjeevi To Host For The Bigg Boss Telugu Season 3

రెండు సీజన్లకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తూ మాంచి రేటింగ్స్‌ రావడంతో సదరు టీవీ ఛానెల్‌ వారు త్వరలోనే సీజన్‌ 3ని ఏర్పాటు చేసే పనిలో పడ్డారు. అతి త్వరలో సీజన్‌ 3ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ‘బిగ్‌బాస్‌ 3’ కోసం ఇప్పటికే విక్టరీ వెంకటేష్‌ను సంప్రదించారు. ఆయన సినిమాల బిజీలో ఉండి ఈ షోకు క్లారిటీ ఇవ్వలేదట. దాంతో యాజమాన్యం తాజాగా మెగా స్టార్‌ చిరంజీవిని సంప్రదించినట్టు సమాచారం. చిరు కూడా ఇంకా ఒకే చెప్పలేదు. కానీ ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు ఫైనల్‌ అయ్యే ఛాన్స్‌ ఉంది.

Megastar Chiranjeevi To Host For The Bigg Boss Telugu Season 3-Megastar Megastar As Big In Viral About

గతంలో చిరంజీవి అదే టీవీ ఛానెల్‌ ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరించాడు. అంతకుముందు సూపర్‌ హిట్‌గా ఉన్న ఆ షో చిరు హోస్టింగ్‌తో ఘోరంగా ఫ్లాపు అయ్యింది. దాంతో ఈ షో కూడా చిరు చేస్తే ఇలాగే ఉంటుంది అని జనాలు గట్టిగా నవ్వుతున్నారు. చిరుకు యాంకరింగ్‌ కంటే హీరోయిజమే బావుంటుంది. ఆయన ఇలా హోస్టింగ్‌ చేయడాన్ని ఎవరు ఇష్టపడరు. అందుకే ‘ఎమ్‌ఈకే’ ఫ్లాపు అయ్యింది. కాబట్టి చిరు కూడా ‘బిగ్‌బాస్‌ 3’ కి ఒకే చెప్పే ఛాన్స్‌ లేదు అంటూ విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.