బ్రేకింగ్‌: సీఎం జగన్‌ కి కృతజ్ఞతలు చెప్పిన చిరంజీవి

ఏపీ సీఎం వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డికి మరోసారి మెగా స్టార్‌ చిరంజీవి మరో సారి కృతజ్ఞతలు తెలియజేశారు.కరోనా పరిస్థితుల కారణంగా సినిమా పరిశ్రమ మరియు సినీ రంగానికి అనుబంధంగా ఉన్న రంగాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఉపశమనం కలిగించేలా రాయితీలు ఇచ్చిన విషయం తెల్సిందే.

 Megastar Chiranjeevi Thanks To Ap Cm Ys Jagan Mohan Reddy-TeluguStop.com

రాయితీల గడువు ఇప్పటికే ముగిసింది.తాజాగా సినిమా పరిశ్రమకు ఇస్తున్న రాయితీలు మరియు విద్యుత్‌ చార్జీల తగ్గింపు ను మరి కొంత కాలం పొడగిస్తూ వైఎస్ జగన్‌ నిర్ణయం తీసుకోవడం పట్ల చిరంజీవి స్పందించారు.

మెగాస్టార్‌ చిరంజీవి ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా మారి అన్ని తానై అన్నట్లుగా చూసుకుంటున్నారు.సినీ కార్మికులకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్‌ ను ఇప్పిస్తామంటూ ఇటీవల ప్రకటించిన మెగాస్టార్‌ చిరంజీవి తాజాగా వైఎస్ జగన్‌ సినిమా ఇండస్ట్రీకి రాయితీని కొనసాగించడం పై కూడా మొదటగా హర్షం వ్యక్తం చేశాడు.

 Megastar Chiranjeevi Thanks To Ap Cm Ys Jagan Mohan Reddy-బ్రేకింగ్‌: సీఎం జగన్‌ కి కృతజ్ఞతలు చెప్పిన చిరంజీవి-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

చిరంజీవి ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ఈ సమయంలో మీరు ఇండస్ట్రీ కి చెందిన వేలాది కుటుంబాలకు ఉపయోగదాయకంగా ఉందని సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశాడు.మెగాస్టార్ ట్వీట్ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

#YS Jagan #Chiranjeevi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు