Chiranjeevi : మళ్లీ కలుస్తా అంటూ భార్యతో కలసి వెకేషన్ వెళ్లిన చిరు!

మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi ) ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే.ఈయన ఇటీవల భోళా శంకర్ ( Bhola Shankar ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

 Chiranjeevi : మళ్లీ కలుస్తా అంటూ భార్య-TeluguStop.com

ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.ఈ సినిమా తర్వాత కొంత విరామం తీసుకున్నటువంటి చిరంజీవి వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర ( Vishwambara ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.

ఈ సినిమా యువీ క్రియేషన్ బ్యానర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఇటీవల ఈ సినిమా షూటింగ్ పనులు కూడా ప్రారంభమైన సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవికి జోడిగా త్రిష నటించిన బోతున్నారు.దాదాపు 18 సంవత్సరాల తర్వాత ఈ జంట తిరిగి మరోసారి తెరపై ప్రేక్షకులను సందడి చేయనుంది.వీరిద్దరూ కాంబినేషన్లో స్టాలిన్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.ఇలా ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నటువంటి తరుణంలో చిరంజీవి ఈ సినిమా షూటింగ్ కు కాస్త బ్రేక్ ఇచ్చారని తెలుస్తుంది.

ఈయన కొంత విరామం తీసుకుని తన భార్య సురేఖ( Surekha ) తో కలిసి వెకేషన్ వెళ్లారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలను చిరంజీవి సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.వాలెంటైన్స్ డే సందర్భంగా అందరికి శుభాకాంక్షలు చెప్పడమే కాకుండా తన భార్య సురేఖతో కలిసి యూఎస్ఏ వెళ్తున్నట్లు తెలిపారు.త్వరలోనే విశ్వంభర షూటింగ్లో  మళ్లీ కలుస్తా అంటూ ఈయన చేసినటువంటి ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో చిరంజీవి పోస్టుకు ఎంతోమంది స్పందిస్తూ వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube