మెగా సోదరికి బ్లడ్ బ్యాంక్ బాధ్యతలు?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మెగాస్టార్ సామాజిక సేవా కార్యక్రమాలలో కూడా తనదైన గుర్తింపు సంపాదించుకున్నారు.

 Megastar Chiranjeevi Sister Doctor Madhavi Inchrge Of Eye And Blood Bank, Megast-TeluguStop.com

ఈ క్రమంలోనే బ్లడ్ బ్యాంకు స్థాపించి ఎంతో మంది ప్రాణాలను కాపాడారు.ఇదిలా ఉండగా కరోనా సెకండ్ వేవ్ వల్ల ఎంతోమందికి సరైన సమయంలో ఆక్సిజన్ అందక మృత్యువాత పడుతున్న సమయంలో మెగాస్టార్ చిరంజీవి, తనయుడు రామ్ చరణ్ ఆక్సిజన్ బ్యాంకులను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉండగా గత రెండు దశాబ్దాల నుంచి ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మెగాస్టార్ బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ గా మెగాస్టార్ సోదరి డాక్టర్ మాధవికి బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఆమెకు అధికారికంగా ఆదేశాలను జారీ చేశారు.

గతంలో ఈ బాధ్యతలన్నీ డాక్టర్ కె గోవింద రెడ్డి బాధ్యతలను చూసుకోగా ఆయన విరమించిన అనంతరం బ్లడ్ బ్యాంక్ బాధ్యతలను మెగాస్టార్ సోదరి మాధవి తీసుకున్నారు.

Telugu Bank, Medical Madhavi, Eye Bank, Chiranjeevi, Tollywood-Movie

ఈ క్రమంలోనే చిరంజీవి బ్లడ్ అండ్ ఐ బ్యాంక్ సిబ్బంది డాక్టర్ మాధవి గారికి శుభాకాంక్షలు తెలియజేశారు.ఇలా ఆపద సమయంలో ఉన్న ఎంతోమంది ప్రాణాలను కాపాడిన బ్లడ్ బ్యాంక్ కరోనా సమయంలో కూడా కరోనా నుంచి కోలుకున్న వారు ప్లాస్మా డొనేట్ చేయాలని చిరంజీవి పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను కూడా నిర్వహించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube