మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ వివాహం నిశ్చయం అయ్యింది.కొన్ని సంవత్సరాల క్రితం ఈమె శిరీష్ భరద్వాజ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.
కాని వారి ప్రేమ పెళ్లి మూడు నాళ్ల ముచ్చటగానే మిగిలింది.విభేదాలు రావడంతో విడాకులు తీసుకుని విడిపోయారు.
విడాకులు తీసుకున్న తర్వాత శ్రీజ విదేశాలకు వెళ్లి మాస్టర్స్ డిగ్రీ చదివింది.ఈమె మాస్టర్స్ పూర్తి చేసిన దగ్గర నుండి కూడా పెళ్లి గురించిన వార్తలు వస్తూనే ఉన్నాయి.
తాజాగా ఈమె పెళ్లిని నిశ్చయించినట్లుగా మెగా ఫ్యామిలీ అధికారికంగా ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్‌లో ఒక సివిల్ కాంట్రాక్టర్‌తో ఈమె వివాహం జరుగబోతున్నట్లుగా మెగా వర్గాల నుండి సమాచారం అందుతోంది.
ఆ కాంట్రాక్టర్‌కు గతంలోనే పెళ్లి అయ్యిందని, కొన్ని కారణాల వల్ల అతను కూడా విడాకులు తీసుకున్నట్లుగా సమాచారం.ఇద్దరు కూడా రెండవ పెళ్లి వారే కావడంతో మెగా ఫ్యామిలీ పెద్దగా ఆలోచన ఏం చేయకుండా పెళ్లి పనుల్లో పడ్డారు.
అతి త్వరలోనే మెగా ఫ్యామిలీలో మరోసారి పెళ్లి భజాలు మ్రోగనున్నాయి.ఈ పెళ్లిని చాలా సింపుల్‌గా జరిపే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రిసెప్షన్ కూడా గ్రాండ్‌గా నిర్వహించక పోవచ్చు అని మెగా సన్నిహితులు అంటున్నారు.